Home సినిమా మైమరపిస్తున్న అను బేబీ

మైమరపిస్తున్న అను బేబీ

Anu Emmanuel and Naga Chaitanya

అక్కినేని నాగచైతన్య, అను ఇమ్మాన్యుయేల్ జంటగా రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘శైలజారెడ్డి అల్లుడు’. మారుతి దర్శకత్వంలో ఎస్.రాధాకృష్ణ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగవంశీ, పి.డి.వి. ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈనెల 31న విడుదలకానుంది. ఈ చిత్రం తొలి గీతం ‘అను బేబీ…’ని యూ ట్యూబ్ ద్వారా వి డుదల చేశారు. ఈ గీతాన్ని కృష్ణకాంత్ రచించగా అనుదీప్ దే వ్ పాడారు. శేఖర్ వి.జె. నృత్య దర్శకత్వం వహించారు. ఇక ఆడియో విడుదల తేదీ, ఇతర వివరాలను త్వరలో తెలియజేస్తామని చిత్ర దర్శక, నిర్మాతలు తెలిపారు. దాసరి అరుణ్‌కుమార్, గిరిబాబు, నరేష్, మురళీశర్మ, వెన్నెల కిషోర్, రఘుబాబు, పృథ్వీ, మధునందన్, శత్రు, కళ్యాణి నటరాజన్ తదితరులు ఈ చిత్ర ప్రధాన తారాగణం. ఈ సినిమాకు కెమెరాః నిజార్ షఫీ, సంగీతంః గోపిసుందర్, పాటలుః సిరివెన్నెల సీతారామశాస్త్రి, శ్రీమణి, కాసర్ల శ్యామ్, కృష్ణకాంత్, ఎడిటర్‌ః కోటగిరి వెంకటేశ్వరరావు, ఫైట్స్‌ః వెంకట్, దిలీప్ సుబ్బరామన్.