Home సినిమా కొంటెచూపుతో మురిపిస్తోంది

కొంటెచూపుతో మురిపిస్తోంది

anu

టాలీవుడ్‌లో వరుసగా గ్లామర్ రోల్స్ చేస్తూ యూత్‌ను అలరిస్తున్న బ్యూటీ అను ఇమాన్యుయల్. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా ఈ  భామ వరుసగా పెద్ద సినిమాల ఆఫర్లను అందుకుంటోంది. ఇక అను ఇమాన్యుయల్‌కు ఫొటో సెషన్‌లో మంచి టేస్ట్ ఉంది. తాజాగా ఈ హాట్ బ్యూటీ చేయించుకున్న ఫొటోషూట్ సోషల్ మీడియాలో నెటజన్లను మైమరపిస్తోంది. కళ్లు జిగేల్‌మనిపించే బ్యాక్‌గ్రౌండ్ స్క్రీనింగ్‌ను ఎలివేట్ చేసేలా అమ్మడి కాస్టూమ్స్ ఉన్నాయి. తన అందం, కొంటె చూపు గ్లామర్‌తో అను ఇమాన్యుయల్ మురిపిస్తోంది. వాలుచూపుతో ఈ భామ స్టైల్‌కు కుర్రకారు గుండె ఝల్లుమంటోంది. ఇటీవల పవన్‌తో కలిసి చేసిన ‘అజ్ఞాతవాసి’ నిరాశపరిచినప్పటికీ  ఆమె చేతిలో ఇప్పుడు మంచి ప్రాజెక్టులే ఉన్నాయి. ప్రస్తుతం అల్లుఅర్జున్‌కు జోడీగా అను ఇమాన్యుయల్ ‘నా పేరు సూర్య-నా ఇల్లు ఇండియా’ చిత్రంలో నటిస్తోంది. ప్రముఖ రచయిత వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రం ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు నాగచైతన్యకు జంటగా ‘శైలజారెడ్డి అల్లుడు’ చిత్రంలో కూడా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది.