Home తాజా వార్తలు అనుష్క అద్వితీయ నటనతో రుద్రమదేవి

అనుష్క అద్వితీయ నటనతో రుద్రమదేవి

Rudhramadeviబ్యూటీక్వీన్ అనుష్క టైటిల్ రోల్‌లో నటించిన సినిమా ‘రుద్రమదేవి’. గుణశేఖర్ దర్శకనిర్మాతగా తెరకెక్కిన ఈ సినిమా భారతదేశపు తొలి హిస్టారికల్ స్టీరియోస్కోపిక్ 3డి చిత్రం. ఈ ప్రతిష్టాత్మక చిత్రం సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. గుణశేఖర్ మాట్లా డుతూ “13వ శతాబ్దానికి చెందిన కాకతీ యుల చరిత్రే ఈ సినిమా. దాదాపు 850 ఏళ్ల క్రితం జరిగిన ఈ కథను ఏమాత్రం వక్రీకరించకుండా ‘రుద్రమ దేవి’ సినిమాను తెరకెక్కించాం. టైటిల్ రోల్‌లో రుద్రమ దేవిగా అనుష్క అద్భుతం గా నటించింది. అల్లు అర్జున్, రానాలు ప్రధాన పాత్రల్లో అదరగొడతారు. ఇతర ప్రధాన పాత్రల్లో కృష్ణంరాజు, ప్రకాష్ రాజ్, నిత్యామీనన్, హంసానందిని, క్యాథరిన్, నథాలియా కౌర్‌లు అందరినీ ఆకట్టుకుంటారు. సెప్టెంబర్ 4న సినిమా ప్రపంచ వ్యాప్తం గా అత్యధిక థియేటర్లలో విడుదల కానుంది”అని అన్నారు.