Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

‘సైరా… నరసింహారెడ్డి’లో అనుష్క?

Anushka

స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ ‘సైరా… నరసింహారెడ్డి’ సినిమాలో నటించనున్నాడు చిరంజీవి. ఇటీవల టైటిల్‌తో పాటు లోగోను రిలీజ్ చేసిన రోజునే సినిమాలోని నటులు, టెక్నికల్ టీంతో ఓ చిన్నపాటి టీజర్‌ను కూడా లాంచ్ చేశారు. ఇందులో హీరోయిన్‌గా నయనతార నటిస్తున్నట్లుగా ప్రకటించారు కూడా. అయితే ఇప్పుడు ఈ సినిమాలో అనుష్క కూడా నటిస్తుందనే టాక్ వినిపిస్తోంది. నిజానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్‌కు ముగ్గురు హీరోయిన్‌లు అవసరం అనే మాట ముందు నుంచి వినిపిస్తోంది. ఇద్దరు భార్యలతో పాటు ఆయన జీవితం పంచుకున్న మరో మహిళ రోల్ కూడా ఈ సినిమాలో ఉంటుందని అంటున్నారు. అందుకోసమే ముగ్గురు హీరోయిన్‌లను ఎంపిక చేస్తున్నారని… ఒక రోల్‌కు నయనతారను ప్రకటించగా… మరో పాత్ర కోసం అనుష్కను సంప్రదించగా ఆమె నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని తెలిసింది. మూడో హీరోయిన్ పాత్ర కోసం బాలీవుడ్ హీరోయిన్‌ను తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిసింది. ప్రస్తుతం అనుష్క చేతిలో భాగమతి చిత్రం మినహాయిస్తే మరో ప్రాజెక్ట్ ఏదీ లేదు. భాగమతి షూటింగ్ పూర్తయిపోయింది కూడా. విజువల్ ఎఫెక్ట్ వర్క్ జరుగుతోంది. అంటే అనుష్క చేతిలో ప్రస్తుతం సినిమాలు లేవనే చెప్పాలి. పైగా బాహుబలి చిత్రంలో దేవసేన పాత్రతో దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ తెచ్చుకున్న అనుష్క… ‘సైరా… నరసింహారెడ్డి’ చిత్రంలో భాగమైతే ఈ సినిమాకు దేశ వ్యాప్తంగా మంచి క్రేజ్ రావడం ఖాయం.

Comments

comments