Home జాతీయ వార్తలు అనుష్క కుస్తీ పట్టు …

అనుష్క కుస్తీ పట్టు …

ANUSKA-SHArma-image-done-inముంబయి :హర్యానాకి చెందిన రెజ్లర్ సుల్తాన్ అలీ ఖాన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్న ‘సుల్తాన్’ చిత్రం కోసం అనుష్క శర్మ కుస్తీ పాఠాలు నేర్చుకున్న సంగతి తెలిసిందే. కుస్తీ పోటీల్లో తాను ఇంత సమర్థంగా పాల్గొనగలుగుతానని వూహించలేదని ఆమె అన్నారు. చిత్రీకరణలో భాగంగా నటి అనుష్క శర్మ స్టేజ్‌పై మరో మహిళతో కుస్తీ పడుతుండగా తీసిన పోటోను చిత్ర బృందం సోషల్ మీడియా ద్వారా పంచుకుందు. ఈ ఫోటును ఉద్దేశించి అనుష్క మాట్లాడుతూ రెండు నెలల క్రితం నేను ఇలా చేయగలనని వూహించలేదని, గొప్పగా అనిపిస్తొందని ట్వీట్ చేశారు. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ కథనాయకుడుగా నటిస్తున్నారు. యశ్‌రాజ్ ఫిల్మ్ పతాకంపై చిత్రాన్ని ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. విశాల్ -శేఖర్ సంగీతం సమకూరుస్తున్నారు.