Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

విరాట్ కోహ్లీకి మామగారి స్పెషల్ గిఫ్ట్

Virat-Kohli

ముంబయి: రన్‌మెషిన్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మలు రెండు నెలల క్రితం వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. అనంతరం కొన్ని రోజుల తర్వాత కోహ్లీ, అనుష్కలు వారివారి వృత్తుల్లో బిజీ అయిపోయారు. ప్రస్తుతం కోహ్లి దక్షిణాఫ్రికా పర్యటనలో బిజీగా ఉండగా, అనుష్క తన సినిమా షూటింగ్‌లతో బిజీ ఉంది. ఇక కోహ్లీ సఫారీ పర్యటనలో తనదైన శైలిలో రాణిస్తూ భారత జట్టుకు అపూర్వ విజయాలను అందిస్తునాడు. ఇదిలాఉంటే అనుష్క తండ్రి అజయ్ కుమార్ తన కొత్త అల్లుడికి ఒక ప్రత్యేకమైన గిఫ్ట్ పంపారు. కవితలంటే ఎంతో ఇష్టడే విరాట్‌కు ప్రముఖ రచయిత్రి తేజశ్విని దివ్యా నాయక్ రచించిన ’స్మోక్స్ అండ్ విస్కీ’ అనే పుస్తకాన్ని కోహ్లీకి అజయ్ కానుకగా ఇచ్చారు. ఇందులో రిలేషన్‌షిప్‌కు సంబంధించిన 42 రచనలు ఉన్నాయి. గురువారం ముంబయిలో ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అజయ్ ఒక కాపీని సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న అల్లుడు విరాట్‌కు పంపిచారట.

Comments

comments