Home స్కోర్ కోహ్లీ క్యాచ్‌కు అనుష్క ఫిదా…(వీడియో)

కోహ్లీ క్యాచ్‌కు అనుష్క ఫిదా…(వీడియో)

Anushka Sharma's Reaction after Virat Kohli takes Superb Catch

బెంగళూరు: టీమిండియా కెప్టెన్, రన్‌మెషిన్ విరాట్ కోహ్లీ గత కొన్ని నెలలుగా భీకరమైన ఫామ్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఫార్మాట్ ఏదైనా విరాట్ ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకు పడుతున్నాడు. దీంతో మైదానంలో పరుగుల వరద పారుతోంది. ప్రస్తుతం జరుగుతున్న ఐపిఎల్ 11వ సీజన్‌లోనూ కోహ్లీ అదే అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సారథిగా ఉన్న విరాట్ ఇప్పటి వరకు ఆడిన 7 మ్యాచుల్లో 317 పరుగులు చేశాడు. మైదానంలో బ్యాట్‌తో పరుగుల వరద పారించే విరాట్ అంతే అద్భుతంగా ఫీల్డింగ్ కూడా చేయగలడు. మైదానం నలుమూలల పాదరసంలా కదులుతుంటాడు కోహ్లీ. పరుగులు ఆపడంలో, క్యాచ్‌లు అందుకోవడంలో చాలా చురుకుగా ఉంటాడు. ఈ ఐపిఎల్‌లో కూడా విరాట్ అద్భుతంగా ఫీల్డింగ్ చేస్తున్నాడు.

ఆదివారం రాత్రి కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ కోహ్లీ తన ఫీల్డింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. వేగంగా ఆడుతూ పరుగులు రాబడుతున్న కోల్‌కతా కెప్టెన్ దినేష్ కార్తీక్ ఇచ్చిన క్యాచ్‌ను విరాట్ డైవ్ చేస్తూ అద్భుతంగా అందుకుని పెవిలియన్ పంపాడు. కోహ్లీ అందుకున్న ఈ క్యాచ్ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. ఇక బెంగళూరు వేదికగా ఆర్‌సిబి ఆడే ప్రతి మ్యాచ్‌కు హాజరవుతోంది కోహ్లీ సతీమణి, బాలీవుడ్ నటి అనుష్క శర్మ. ఈ నేపథ్యంలోనే ఆదివారం కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌కు కూడా అనుష్క వచ్చింది. మ్యాచ్‌లో కోహ్లీ పట్టిన ఆ అద్భుతమైన క్యాచ్‌కు గ్యాలరీలో కూర్చున్న అనుష్క ఇచ్చిన రియాక్షన్ ఇప్పుడు అంతర్జాలంలో వైరల్ అవుతోంది. ఆమె హవభావాలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ మ్యాచ్‌లో కోహ్లీ 44 బంతుల్లోనే 68 పరుగులు చేశాడు. కానీ, బెంగళూరుకు మాత్రం ఓటమి తప్పలేదు.

https://twitter.com/imetsf/status/990825900361969666