Home సినిమా మరో లేడీ ఓరియెంటెడ్ సినిమాలో…

మరో లేడీ ఓరియెంటెడ్ సినిమాలో…

Anushka

ఒకప్పుడు లేడీ ఓరియెంటెడ్ సినిమా అంటే పెద్దగా ప్రాధాన్యతనిచ్చే వారు కాదు. కానీ అలాంటి పరిస్థితుల్లో విజయశాంతి ప్రధాన పాత్రలో ‘కర్తవ్యం’ వచ్చి అందరి మైండ్‌సెట్‌ను మార్చింది. ఆతర్వాత పలు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో ఆమె నటించి లేడీ అమితాబ్ అనే బిరుదును తెచ్చుకుంది. ఇప్పుడు సౌత్‌లో ఆ రేంజ్‌లో మళ్లీ లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ పేరు తెచ్చుకుంది నయనతార. తమిళనాడులో నయనతార స్టార్‌డమ్ హై రేంజ్‌లో ఉంది. ఆమె పేరుంటే చాలు సినిమాకు మంచి బిజినెస్ అవుతోంది. ఇప్పుడు తెలుగులో అనుష్క కూడా అలాంటి దారిలోనే పయనిస్తున్నట్టుగా ఉంది. ఇప్పటికే ఆమె అరుంధతి, పంచాక్షరి, రుద్రమదేవి, వర్ణ, జీరో సైజ్, భాగమతి… ఇలా చాలా లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించింది. ఇందులో ఎక్కువ సినిమాలు హిట్లే. మళ్లీ ఇప్పుడు అనుష్క ఓ యువ దర్శకుడు చెప్పిన లేడీ ఓరియెంటెడ్ స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. ఈ సినిమాలో ఆమెకు జోడీగా మాధవన్ నటిస్తాడట. కోన కార్పొరేషన్, పీపుల్ మీడియా వారు ఈ సినిమాను నిర్మిస్తారని సమాచారం. ఈ సినిమాతో పాటు అనుష్క కోసం మరో రెండు లేడీ ఓరియెంటెడ్ స్క్రిప్టులు సిద్ధమవుతున్నాయట. చూస్తుంటే స్వీటీ తెలుగు నయనతారగా మారేలా కనిపిస్తోంది. మరి నయనతారలా అనుష్క వరుసగా హిట్స్ సాధిస్తుందా, లేదా అనేది తెలియాలంటే కొంతకాలం వేచి చూడాలి.