Home తాజా వార్తలు అనుష్క కొత్త సిన్మాకి టైటిల్ ఖరారు…

అనుష్క కొత్త సిన్మాకి టైటిల్ ఖరారు…

Anushka shetty new movie title finalized

సినిమా: అనుష్క ప్రధానమైన పాత్ర పోషించిన ‘భాగమతి’ చిత్రం భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఆ తరువాత అనుష్క మరే సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఇటీవల కాలంలో రెండు మూడు సినిమాలకి ఆమె సైన్ చేసారని వినిపించింది. కానీ అదంతా కేవలం ప్రచారం మాత్రమేనని తెలిసింది. తాజాగా అనుష్క ఒక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్. హేమంత్ మధుకర్ తెలుగులో ఒక సినిమా చేయనున్నారు. ఈ సిన్మాతో ఆయన టాలీవుడ్ కి దర్శకుడిగా పరిచయం కానున్నాడు. ఈ సిన్మా కోసం మాధవన్ ను ఆయన ఎంపిక చేశాడు. తాజాగా అనుష్కను తీసుకున్నాడని సమాచారం. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సిన్మాకి ‘సైలెన్స్’ అనే టైటిల్ ను ఖరారు చేసినట్టు చిత్రయూనిట్ వెల్లడించింది. విభిన్నమైన కథాకథనాలతో రూపొందుతోన్న ఈ సిన్మాను, డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టుగా టాక్ వినిపిస్తోంది.