Search
Sunday 18 November 2018
  • :
  • :

ఎబిడి రిటైర్మెంట్‌పై అనుష్క ట్వీట్

anu

న్యూఢిల్లీ: క్రికెటర్ ఎబి డి విలియర్స్(34) బుధవారం అంతర్జాతీయ క్రికెట్ నుంచి తన రిటైర్మెంట్‌ను ప్రకటించడం అందరిని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన తన 14 కెరీర్‌కు గుడ్‌బై చెప్పబోతున్నట్లు టిట్టర్ ద్వారా వెల్లడించాడు. ‘నేను వెంటనే అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ కావాలనుకుంటున్నాను. 114 టెస్టులు, 228 వన్డేలు, 78 అంతర్జాతీయ టి20లు ఆడాను. ఇతరులకు అవకాశం ఇవ్వాల్సిన తరుణం ఆసన్నమైంది. నేను ఇప్పటికే చాలా అలసిపోయాను. కనుక రిటైర్ కావాలనుకుంటున్నాను’ అని అతడు ట్విటర్‌లో పేర్కొన్నాడు. అయితే దీనిపై బాలీవుడ్ తార అనుష్క శర్మ ప్రత్యేక సందేశాన్ని ఈ దక్షిణాఫ్రికా దిగ్గజం ఎబి డి విలియర్స్‌కు పంపింది. ఆమె తన ట్వీట్‌లో ‘ ఎబి డి విలియర్స్, జీవితంలో మనం సకారాత్మకంగా ఏమి చేస్తామో అది ఇతరులపై ప్రభావాన్ని చూపుతుంది. మనకన్నా ఇతరులకు అది ఎకువ అర్థాన్ని ఇస్తుంది. మీరు చాలా హూందాగా, గొప్పగా చేయాల్సింది చేశారు. మీకు, డానియెల్లెకు భవిష్యత్తు ఆనందకర జీవితం కావాలని కోరుకుంటున్నాను. సాంప్రదాయేతర షాట్లు కొట్టడంలో, వేగంగా స్కోరు చేయడంలో ఎబి డి విలియర్స్‌కు మంచి పేరుంది. అంతర్జాతీయ వన్డే మ్యాచుల్లో 16 బంతుల్లో అత్యంత వేగంగా అర్ధశతకం, 31 బంతుల్లో 100, 64 బంతుల్లో 150 పరుగులు చేసిన ఖ్యాతి అతడికుంది. ప్రస్తుత ఐపిఎల్‌లో ఆయన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడాడు.

Comments

comments