Search
Saturday 22 September 2018
  • :
  • :

ఈ ఏడాది చివర్లో పెళ్లి?

Anushka wants to get married at the right time

12 ఏళ్లుగా సౌత్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న బ్యూటీ అనుష్క శెట్టి. బాహుబలి, అరుంధతి, రుద్రమదేవి, భాగమతి వంటి పలు హిట్ సినిమాలతో ఈ భామ ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. అయితే గత కొంతకాలంగా అనుష్క పెళ్లిపై పలు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు వీటిపై ఎలాంటి క్లారిటీ రాలేదు. ఇప్పుడు మరోసారి ఈ భామ పెళ్లిపై వార్తలు వచ్చాయి. ఖచ్చితంగా అనుష్క ఈ ఏడాది చివరలో పెళ్లి కూతురు కానుందని సమాచారం. ఆమె తల్లిదండ్రులు వరుడి కోసం బాగానే వెతుకుతున్నారట. మంచి వరుడు దొరికిన వెంటనే అనుష్క పెళ్లి చేస్తారని తెలిసింది. అందుకే ఈ భామ కొత్త సినిమాలు కూడా ఒప్పుకోవడం లేదు. హిట్ మూవీ ‘భాగమతి’ వచ్చి ఆరు నెలలు అవుతున్నా ఇప్పటివరకు మరో సినిమాకు సైన్ చేయలేదు ఈ భామ. ఆమధ్య మలయాళంలో ఓ ఆఫర్ వచ్చినా కూడా నో చెప్పేసింది ఈ బ్యూటీ. దాంతో అనుష్క త్వరలో పెళ్లి చేసుకోవడం ఖాయమని అంటున్నారు. అందుకే ఆమె ఈమధ్య గుళ్లు గోపురాలను దర్శించుకుంటోంది.

Comments

comments