Home సినిమా 13 ఏళ్ల తర్వాత అతనితో…

13 ఏళ్ల తర్వాత అతనితో…

Anushka

ప్రముఖ రచయిత కోన వెంకట్ ఈమధ్య ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టారు. కోన ఫిలిం కార్పొరేషన్ పేరుతో పలు చిత్రాలను నిర్మిస్తున్న ఆయన ప్రస్తుతం నాగచైతన్య, సమంతలు నటిస్తున్న చిత్రానికి సమర్పకులుగా వ్యవహరించనున్నారు. ఇక చిన్న దర్శకుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీసే ప్రయత్నం చేస్తున్న కోన వెంకట్ త్వరలో మరో సినిమాను మొదలుపెట్టబోతున్నారు. ఆ చిత్రంలో అనుష్క, మాధవన్ కలిసి నటించబోతున్నారు. అనుష్క కెరీర్ ఆరంభంలో అంటే దాదాపు 13 ఏళ్ల క్రితం మాధవన్‌తో కలిసి ‘రెండు’ అనే తమిళ చిత్రంలో నటించింది. ఆ చిత్రం తర్వాత మళ్లీ ఇప్పటివరకు మాధవన్, అనుష్కలు కలిసి నటించలేదు. మళ్లీ ఇన్నాళ్లకు కోన వెంకట్ మూలంగా వాళ్లిద్దరూ కలిసి నటించబోతున్నారు.  విభిన్నమైన ప్రేమ కథతో ఈ చిత్రాన్ని హేమంత్ మధుకర్ తెరకెక్కించబోతున్నాడు. హేమంత్ ఎనిమిది సంవత్సరాల క్రితం మంచు విష్ణుతో ‘వస్తాడు నా రాజు’ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. ఆ చిత్రం ఆశించినంత సక్సెస్‌ను అందుకోలేకపోయింది. మళ్లీ ఇన్నాళ్లకు కోన సహకారంతో అనుష్క, మాధవన్‌లతో సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో నిర్మించబోతున్నారు.

Anushka With Him After Thirteen Years 

Telangana News