Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

ప్రభాస్ తో పెళ్లి రూమర్స్ పై స్పందించిన అనుష్క తల్లి

anushka

తెలుగు సినిమాకు  ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకువచ్చిన బాహుబలి సినిమాతో  ప్రభాస్, అనుష్క జోడీకి మంచి క్రేజ్ ఏర్పడింది. దీంతో అప్పటి నుంచి  ప్రభాస్, అనుష్క పెళ్లి చేసుకోబోతున్నారని రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. అయితే అనుష్క ఈ రూమర్స్‌ని ఖడించారు. ‘నా పెళ్లిపై రూమర్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో అర్థం కావడం లేదు ఈ వార్తలో వాస్తవం లేదు, ప్రభాస్, నేను పెళ్లి చేసుకోవడం లేదు. దయచేసి రియల్ లైఫ్‌లో బాహుబలి, దేవసేన కెమిస్ట్రీని ఎక్స్‌పెక్ట్ చెయ్యొద్దు, అది స్క్రీన్ వరకూ మాత్రమే’’ అని తెలిపింది. తాజాగా అనుష్క తల్లి ఈ రూమర్స్‌పై స్పందించారు. ‘‘వాళ్లిద్దరూ స్టార్స్.. అలాగే ఇద్దరూ కలిసి నటించారు. నాకు అనుష్క కోసం ప్రభాస్ వంటి మిస్టర్ పర్‌ఫెక్ట్‌  అల్లుడుగా రావాలనే ఉంది. కానీ వాళ్లిద్దరూ మంచి స్నేహితులు మాత్రమే. అంతకు మించి ఇద్దరి మధ్య ఏమీలేదు. ఇప్పటికైనా ఇలాంటి రూమర్స్‌ ఆపేస్తారని భావిస్తున్నా’ అంటూ అనుష్క తల్లి పెళ్లి గాసిప్స్‌కి చెక్ పెట్టారు. గతంలో ప్రభాస్, అనుష్క కలిసి మిర్చి, బిల్లా వంటి మంచి సక్సెస్ సినిమాలు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ సాహో సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అనుష్క భాగమతి తర్వాత తన తదుపరి చిత్రాన్ని ఇంతవరకూ ప్రకటించలేదు.

Comments

comments