Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

పవర్‌ఫుల్ లేడీగా…

anasuya

కొందరు యాంకర్‌లు బుల్లితెరతో పాటు వెండితెరపై కూడా సత్తా చాటుతున్నారు. మంచి సినిమాల్లో నటిస్తూ తమ టాలెంట్ చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో యాంకర్ అనసూయ తన నటనతో ప్రేక్షకులను అలరిస్తూ మంచి అవకాశాలను అందుకుంటోంది. ఇటీవల రామ్‌చరణ్ ‘రంగస్థలం’ చిత్రంలో ఆమె రంగమ్మత్తగా నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పుడు అదే స్థాయిలో మెప్పించడానికి అనసూయ సిద్ధమవుతోంది.ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి బయోపిక్ ‘యాత్ర’లో ఆమె కీలక పాత్రలో కనిపించనుంది. మహి వి.రాఘవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వైఎస్‌ఆర్ పాత్రలో మమ్ముట్టి నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో అనసూయను ఒక ముఖ్యమైన పాత్ర కోసం తీసుకున్నారట. కర్నూలు జిల్లాలోని ఒక పవర్‌ఫుల్ లేడీ క్యారెక్టర్‌లో ఆమె కనిపించనున్నట్టు తెలిసింది.

Comments

comments