Home సినిమా చిరుకు జోడీగా స్వీటీ

చిరుకు జోడీగా స్వీటీ

Anuskhka shettiy in Syra narasimha reddy

తెలుగులో ఎంతోమంది హీరోలున్నారు కానీ మెగాస్టార్ చిరంజీవిని మరిపించే స్టార్ మాత్రం ఇంకా రాలేదు. అందుకే 60 ఏళ్లు దాటినా… మధ్యలో పదేళ్లు సినిమాలకు దూరంగా ఉన్నా చిరు క్రేజ్ మాత్రం కొంచెం కూడా తగ్గలేదు. ప్రస్తుతం ‘సైరా’ షూటింగ్‌లో బిజీగా ఉన్న ఆయన కొరటాల శివ సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జోరుగా సాగుతోంది. ఈ సినిమా కోసం నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపికపై కొరటాల కసరత్తు చేస్తున్నాడట. చిరు వయసును దృష్టిలో పెట్టుకుంటే అతనికి సరిగ్గా సరిపోయే హీరోయిన్‌ను ఎంపిక చేయడం కత్తిమీద సాములాంటిది. అందుకే చిరంజీవి సీనియర్ హీరోయిన్లను తీసుకుందామని సూచిస్తే కొరటాల మాత్రం 30 ప్లస్ వయసున్న మోడల్‌ను కానీ సీరియల్ నటిని కానీ తీసుకునే ఆలోచనలో ఉన్నాడని ఇటీవల వార్తలు వచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం కొరటాల చిరు సలహాకు ఓకే అన్నాడు. చిరంజీవికి జోడీగా అనుష్కను హీరోయిన్‌గా తీసుకుంటున్నారు. ఈ ఆఫర్‌కు స్వీటీ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ప్రభాస్, కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన ‘మిర్చి’లో అనుష్క హీరోయిన్‌గా నటించింది. ఇప్పుడు మరోసారి కొరటాల దర్శకత్వంలో ఆమె నటించనుంది. తెలుగురాని ముంబయ్ బ్యూటీని తీసుకొచ్చి ఆమెకు యాక్టింగ్ నేర్పించి తెలుగు అర్థమయ్యేటట్టు చేసేకంటే చిరు సూచనను పాటించడం మంచిదని అనుష్కను తీసుకున్నారట. స్వీటీ స్టార్ హీరోయినే కాదు ఆమెకు మంచి క్రేజ్ కూడా ఉంది. ఈ కొత్త సినిమా అధికారిక ప్రకటన చిరంజీవి పుట్టిన రోజు అయిన ఆగస్టు 22న రానుందని తెలిసింది.