Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

యాపిల్ సదస్సుకు అన్వితా విజయ్

ANYITAన్యూయార్క్ : యాపిల్ సదస్సుకు హాజరుకానున్న పిన్న వయస్కురాలిగా భారత సంతతికి చెందిన ఆస్ట్రేలియా బాలిక రికార్డు సృష్టించింది. ఐఫోన్, ఐప్యాడ్‌లలో వాడే కొన్ని చిన్న పిల్లల యాప్‌లను తొమ్మిదేళ్ల అన్వితా విజయ్ రూపొందించింది. శాన్‌ఫ్రాన్సిస్కోలో జరగనున్న WWDC – 2016 సదస్సులో యాపిల్ సీఈవో టిమ్‌కుక్‌ను కలుసుకోవడం తన కల అని అన్వితా చెబుతోంది. యూట్యూబ్ ద్వారా యాప్‌లను అభివృద్ధి చేసే ఉచిత కోడింగ్ పాఠాలను నేర్చుకొని ఆమె వీటిని తయారు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా యాప్‌లను తయారు చేసే వారికి యాపిల్ ఉపకారవేతనాలు అందిస్తోంది.

Comments

comments