Search
Sunday 18 November 2018
  • :
  • :

నాన్న రిటైర్…

పక్క గదిలో రిటైర్డు భర్త గారు వెంకట్రావ్ ఆ నవ్వు వినగానే గతుక్కు మన్నాడు. నిన్ననే ఆయన రిటైరయ్యాడు. ఇక ముందు తోచడం ఎలాగ అని మిత్రుడు సుబారావుని ఐడియా అడిగాడు. దానికి సుబ్బారావు చెవిలో జోకు పేలినట్లు నవ్వేసి ‘ అదేమంత సమస్య కాదోయ్. ఇంతకాలం మీ ఆవిడ నువ్వు ఆఫీసుకి తగలడ్డాక ఇంట్లో టీవీ చూసేస్తూ, పక్కమీద పడి దొర్లుతూ తెగ సుఖపడిపోయి ఉంటుంది. ఇప్పుడు నువ్వు రిటైరయి ఇంట్లో అఘోరిస్తావ్ కాబట్టి ఆమెని తెగ సతాయిస్తే నీకు కాలక్షేపమూ అవుతుంది. నువ్వంటే భయమూ భక్తీ నిలబెట్టినట్టూ ఉంటుంది’ అని సలహా పారేశాడు.

Retirement

చాట్ భండార్: వర్ధనమ్మకి నవ్వొచ్చింది. తలంటు పోసుకున్నాక జుట్టు ముడి వేద్దామంటే లొంగింది కాదు. ఎన్నిసార్లు ప్రయత్నిస్తే అన్ని సార్లూ ఊడిపోతూ వచ్చింది. ఆరుసార్లు అలా ఊడింది ముడి. అదిగో అప్పుడే వర్ధనమ్మకి నవ్వొచ్చింది. స్విచ్ ఆన్ చేయగానే హఠాత్తుగా గదిలో వెలుగు చిమ్మినట్లు, టాప్ తిప్పీతాప్పగానే నీరు దూసుకొచ్చినట్లు అమెకి నవ్వు తన్నుకొచ్చింది.

పక్క గదిలో రిటైర్డు భర్త గారు వెంకట్రావ్ ఆ నవ్వు వినగానే గతుక్కు మన్నాడు. నిన్ననే ఆయన రిటైరయ్యాడు. ఇక ముందు తోచడం ఎలాగ అని మిత్రుడు సుబారావుని ఐడియా అడిగాడు. దానికి సుబ్బారావు చెవిలో జోకు పేలినట్లు నవ్వేసి ‘ అదేమంత సమస్య కాదోయ్. ఇంతకాలం మీ ఆవిడ నువ్వు ఆఫీసుకి తగలడ్డాక ఇంట్లో టీవీ చూసేస్తూ, పక్కమీద పడి దొర్లుతూ తెగ సుఖపడిపోయి ఉంటుంది. ఇప్పుడు నువ్వు రిటైరయి ఇంట్లో అఘోరిస్తావ్ కాబట్టి ఆమెని తెగ సతాయిస్తే నీకు కాలక్షేపమూ అవుతుంది. నువ్వంటే భయమూ భక్తీ నిలబెట్టినట్టూ ఉంటుంది’ అని సలహా పారేశాడు.

అప్పుడు తను ‘తోచదనే బెంగతీరి ముచ్చటపడిన విషయం ఈమె పసిగట్టి నవ్వటం లేదు గదా’ అని సందేహించాడు. ‘అబ్బే అదెలా తెలుస్తుంది’ అని ధైర్యం చెప్పుకొన్నాడు. అంతలో ‘ అసలే రిటైరైన వాణ్ణి. ఇలాంటివి ఉపేక్షిస్తే ఆనక ఇంట్లో పడుండే నన్ను పురుగులా చూస్తుంది’ అని ఆలోచించినవాడై, ఎందుకైనా మంచిదని గబగబా వెళ్లి వర్ధనమ్మ ముందు చేతులు కట్టుకు నిలబడి ‘చచ్చినా అలా చేయను సుమీ’ అన్నాడు ఎక్కం అప్పజెబుతున్న ముఖంతో. వర్ధనమ్మ అర్థం కాకపోయినా ‘ఈయన గారు ఎప్పుడు అర్థమయ్యారు కనుక ’ అనుకొని ‘అయ్యో.. నేనేం అనుకోను లెండి’ అంది వెంకట్రావుని ఊరడించడం మామూలే కాబట్టి.

వెంటనే రుణపడిపోతున్న ముఖం పెట్టుకొని వెంకట్రావ్ లోపల్లోపల సంతోషిస్తూ నిష్క్రమించాడు. అంతలో కూతురు సుబ్బలక్ష్మివచ్చింది. ఆమె కూడా తన తల్లి వర్ధనమ్మ నవ్వు విని ఉలిక్కిపడి వచ్చింది. ‘ నాన్న రేపటినుంచి రిటైనవుతున్నాడు కనుక తన పెళ్లి సమస్య కాకుండా క్లాస్‌మేట్ జెజె రావుతో చెక్కేద్దామా’ అని అప్పుడే అనుకొంటుండగా తల్లి నవ్వు వినపడింది. తనకు తెలిసి సంసారంలో సరిగమలకు దూరంగా నవ్వు అనేది లేకుండా బతికిన తల్లి ఇంత చేటు నవ్వుతున్నది తన మనసులోని ‘తెగింపు ఆలోచన’ తెలిసి వెక్కిరించడానికే – అని బాధపడి, వర్ధనమ్మ ఎదుట నిలబడి ‘ఊరికే అనుకున్నా అలా చేయను అంది’ వినయంగా.

అసలు వర్ధనమ్మకి తెలిసే చాన్సు లేని విషయమే అయినా ఎందుకైన ఆ మంచిదని ఓ వినయపు మాట అలా విసిరింది తల్లి ముఖం మీదికి.

అప్పుడే వసంత కుమార్ అనే వర్ధనమ్మ పుత్రరత్నం కూడా తల్లి నవ్వు విని కుదుపు ఫీలయ్యాడు. నాన్న రిటైరయ్యాడు కనుక తన దారి తాను చూసుకోవడానికి ఇంట్లోంచి పారిపోయి ఉద్యోగం వెతుక్కుందా మనుకొన్న తన మనసులోని మాట అమ్మకి ఎలా తెలిసిందని విస్తుపోయాడు. తెలిసే చాన్సులేదు. కానీ-

ఎందుకైనా మంచిది సారీ చెప్పేద్దామని వచ్చాడు. అతడు చూపింది కూడా విని ‘ఏమైంది ఈ వేళ వీళ్లకి?’ అని విస్తుపోతూ ఈసారి అర్థం లేని నవ్వు విసిరింది వర్ధనమ్మ. తెరలు తెరలుగా ఆమె నవ్వుతుంటే ఇంట్లో అందరికీ తేళ్లూ జెర్రులూ పాతుతున్నట్లుంది.

Comments

comments