Home నల్లగొండ ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం

ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం

పాలిహౌస్, డ్రిఫ్ ఇరిగేషన్‌లకు రూ.700కోట్లు కేటాయింపు
1000ఎకరాల విస్తీర్ణంలో పాలిహౌస్ రైతులకు 75శాతం సబ్సిడీ
వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు నెలకొల్పేవారికి ప్రోత్సాహం
తెలంగాణ రాష్ట్రంలో క్రాఫ్ కాలనీలు ఏర్పాటు మంత్రి పోచారం

Pocharamభువనగిరి: ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. భువనగిరిలో పాలిహౌస్ సేధ్యం ద్వారా తక్కువ పెట్టుబడితో తక్కువ కాలంలో ఎక్కువ లాభాలను గడించి విజయం సాధించిన పోతంశెట్టి వెంకటేష్, నిర్మల రైతు దంపతులను బుధవారం మంత్రి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డిలు ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా వారి పాలిహౌస్‌ను మంత్రి పరిశీలించి రైతును సేద్యం వివరాలను అడిగితెలుసుకున్నారు. అనంతరం జరిగిన సభలో మంత్రి పోచారం మాట్లాడుతూ పాతపద్దతులను అవలంభిస్తు వ్యవసాయరంగంపై ఆధారపడ్డ రైతాంగం నేడు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు పాత పద్దతులకు స్వస్తిపలికి శాస్త్రీయమైన, సాంకేతిక పరమైన విధనాలతో వ్యవసాయం చేయాలని తద్వారా తక్కువ పెట్టుబడులతో ఎక్కువ లాభాలను ఘడించవచ్చన్నారు. రైతులను అన్ని రకాలుగా ఆదుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో అనేక పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. ఎటువంటి పంటలు వేస్తే రైతులు ఆర్ధికంగా పరిపుష్టత సాధిస్తారనే లక్షంతో వ్యవసాయ శాస్త్రవేత్తలు, ప్రభుత్వం ఎప్పటికప్పుడూ చర్చిస్తూ నూతన ఒరవడిలకు శ్రీకారం చుడుతున్నామన్నారు. పాలిహౌస్ సాగుద్వారా అనేక మంది రైతులు తక్కువ పెట్టుబడులతో ఎక్కువ లాభాలు గడించి విజయం సాధిస్తున్నారన్నారు. భువనగిరిలో పోతంశెట్టి వెంకటేశం 560స్కేర్ మీటర్ల విస్తీర్ణంలో సాగు చేసి మూడు నెలల కాలంలో 85వేల లాభాన్ని గడించారని ఆయన రైతాంగానికి ఆదర్శమన్నారు. పాలిహౌస్ సేధ్యం చేయడానికి రైతులు ముందుకు వస్తే 75శాతం సబ్సిడీ ఇస్తున్నామని తెలిపారు. ఇంత సబ్సిడీ దేశంలో ఏరాష్ట్రం ఇవ్వడం లేదని ఆ ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఈఅవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సంవత్సరం రాష్ట్రంలో వెయ్యి ఎకరాలలో పాలిహౌస్, డ్రిఫ్ ఇరిగేషన్‌లద్వారా సేధ్యం చేయాలని ప్రభుత్వం నిర్ణయించి అందుకు 700కోట్లు కేటాయించినట్లు మంత్రి వివరించారు. లక్షంగా పెట్టుకున్న వెయ్యి ఎకరాల కూరగాయల సాగులో ఇప్పటికే రైతులు 883ఎకరాలలో సాగు చేయడానికి 383మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. అందులో 49మంది నల్లగొండ జిల్లా రైతులున్నారని అన్నారు. బోరుబావుల క్రింద ఎకరానికి ఆరుక్వింటాళ్ల దిగుబడి వస్తే డ్రిఫ్ ఇరిగేషన్, పాలిహౌస్‌ల సేద్యం ద్వారా ఎకరానికి 20క్వింటాళ్ల దిగుబడి రానున్నదని వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఈ స్కీంలకు కేవలం 300కోట్లు మాత్రమే కేటాయించి నామమాత్రపు సబ్సిడీ అందజేశారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి టీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే రైతాంగానికి అన్ని రకాల సబ్సిడీలు కల్పించి ఆదుకుంటున్నామన్నారు. పాలిహౌస్ సేధ్యం చేసుకోవడానికి ముందుకు వచ్చే రైతులు 25శాతం భరిస్తే 75శాతం ప్రభుత్వం భరిస్తుందన్నారు. మనరాష్ట్రంలో కేవలం పదిశాతం మాత్రమే కూరగాయలు పండిస్తు న్నామని 90శాతం బయటిరాష్ట్రాల నుండి దిగుమతి చేసుకుంటున్నామని మంత్రి తెలిపారు. ఈ నేపధ్యంలో కూరగాయలు పాలిహౌస్‌ల ద్వారా భారీ ఎత్తున సాగు చేసుకోవడానికి బృహత్తర ప్రణాళికను తయారు చేశామ న్నారు. ఒక మండలంలో అక్కడి ప్రజలకు ఎన్ని కూరగా యలు అవసరమో అన్ని కూరగాయలు పండించడానికి ఆప్రాంతలోనే క్రాఫ్ కాలనీలు ఏర్పాటు చేసి సేధ్యం చేయడానికి ప్రణాళికలు తయారు చేస్తున్నామన్నారు. అందుకు రైతులను భారీ ఎత్తున ప్రోత్సాహించి పండించిన కూరగాయలను అక్కడనే అమ్ముకోవడానికి మార్కెట్ యార్డులను ఏర్పాటు చేసి ఉచితంగా ట్రాన్స్‌ఫోర్ట్ వ్యవస్థను కల్పిండానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు నెలకొల్పడానికి పారిశ్రామిక వేత్తలు ముందుకు వచ్చినట్లైతే పదిహేను రోజులలో అన్ని రకాల అనుమతులు కల్పిస్తా మని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. 5కోట్ల లోపు పరిశ్రమ అనుమతి జిల్లా కలెక్టర్ స్థాయిలో ఇస్తారని, 5కోట్లు దాటితే ముఖ్యమంత్రి కార్యా లయ ఉన్నతా ధికారులు అనుమతులిస్తారని వివరించారు. ఏ అధికారి అయినా నిర్ణీత గడువులో అనుమతి ఇవ్వనట్లైతే ఆ అధికారిపై శాఖాపరమైన చర్యలు తీసుకొని రోజుకు వెయ్యి రూపాయలు ఫైన్ విధిస్తామని హెచ్చరించారు. మైక్రో ఇరిగేషన్ క్రింద ఒక హెక్టారుకు (12.5) ఎకరాలలో సేధ్యం చేసుకునే ఎస్సీ, ఎస్టీలకు నూటికి నూరు శాతం సబ్సిడీ ఇస్తామని, బీసీ రైతులకు 90శాతం, మిగతా రైతులకు 80శాతం సబ్సిడీలు అందజేస్తామన్నారు. ప్రభుత్వ పరంగా ప్రవేశపెట్టే వ్యవసాయ రంగ పథకా లన్నింటిని రైతులు సద్వినియోగం చేసుకొని తక్కువ పెట్టుబడులతో ఎక్కువ లాభాలు గడించి ఆర్థికంగా బలోపేతం కావాలని మంత్రి పోచారం కోరారు. అనం తరం వివేరా హోటల్ యజమాని సద్వివెంకట్‌రెడ్డి ఆధ్వ ర్యంలో ఆయన ఫామ్ హౌస్‌లో పండిస్తున్న కూరగాయల పంటలను, పాలిహౌస్‌ను మంత్రి, ఎమ్మెల్యే ఇతర అధికా రులు పరిశీలించి ఆయనను అభినం దించారు. పాలిహౌస్ సేధ్యం వైపు రైతులు మందడుగు వేసి లాభాలు గడించా లన్నారు. ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున పాలిహౌస్‌లకు సబ్సిడీలు ఇస్తు రైతులు ఆర్థికంగా నిలదొ క్కుకోవడానికి సహాకరిస్తుందన్నారు. ఈ సమావేశంలో ఉధ్యానవన శాఖ కమీషనర్ వెంకట్రామిరెడ్డి, పీఏసీఎస్ ఛైర్మన్ ఎడ్ల సత్తిరెడ్డి, ఆర్డీవో మధన్‌మోహన్, టీఆర్‌ఎస్ నాయకులు డాక్టర్ జడల అమరేందర్, కొలుపుల అమ రేందర్, మారగోని రాము గౌడ్, చంద్రభాను నాయక్, మోహన్‌రెడ్డి, అంజనేయులు, మొగిలిగోపాల్‌రెడ్డి, చిక్క ప్రభాకర్, శ్రీనివాస్, డాక్టర్ నోముల పరమేశ్వర్‌రెడ్డి, గోధ శ్రీనివాస్‌గౌడ్, మందుల సువర్ణ, మందుల వెంకటయ్య, నర్సింగరావు పాల్గొన్నారు.