Search
Monday 24 September 2018
  • :
  • :

పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు

nirmal-image

మన తెలంగాణ/నిర్మల్‌టౌన్ : పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చిన సివిల్ టాపర్, తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో గల బేస్థావర్‌పేట్ వ్యక్తి అనుదీప్ గురించి మం త్రి ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్‌లో దేవరకోట దేవస్థానం ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్‌కె కన్వేన్షన్ హాల్‌లో సన్మాన సభ నిర్వహించారు.ఈ సందర్బంగా నిర్మల్‌లోని వ్యాపార వ్యక్తులు, రాజకీయ వ్యక్తులు వారిని ఘనంగా  సన్మానించారు. ముందుగా తాను పుట్టిన స్థలం అయిన పట్టణంలోని బేస్తావర్‌పేట్‌లో గల అమ్మమ్మ వాళ్ల ఇంటికి చేరుకున్నారు. తాను నిత్యం కొలిచే హనుమాన్ ఆలయాన్ని సందర్శించిన తాను అమ్మమ్మ  వాళ్ల ఇంటికి వెల్లారు. అక్కడ తమ తల్లిదండ్రిలతో పాటు అమ్మమ్మతో కలిసి తాతయ్య చిత్రపటం వద్ద నివాళ్లర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తాను పుట్టి పెరిగిన బంగల్‌పేట్, చెరువు, మహాలక్ష్మి ఆలయం ఎప్పటికి మరువలేమన్నారు. అనంతరం అక్కడ కాలని వాసులందరిని కలసి సభ స్థలానికి చేరుకున్నారు. అక్కడ సన్మాన అనంతరం మాట్లాడుతూ పట్టుదల ఉంటే ఏదైన సాధించివచ్చన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తనకు ఏ సేవలో పని చేస్తావని అడిగినప్పుడు తాను తెలంగాణ కోసమే పని చేస్తానని పేర్కొన్నారన్నారు.

Comments

comments