Home జాతీయ వార్తలు 8 నుంచి ఎపి అసెంబ్లీ సమావేశాలు

8 నుంచి ఎపి అసెంబ్లీ సమావేశాలు

APASSEMBLYఅమరావతి : ఎపి అసెంబ్లీ సమావేశాలు వచ్చే నెల 8వ తేదీ నుంచి హైదరాబాద్‌లో జరగనున్నాయి. ముందు ఆరో తేదీ నుంచి జరపాలని భావించారు. అయితే వినాయక చవితి పండుగ అయిన వెంటనే సమావేశాలంటే ఎమ్మెల్యేలు, మంత్రులకు ఇబ్బంది అవుతుందన్న భావనతో మరో రెండు రోజుల తరువాత 8వ తేదీ నుంచి జరపాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఆ సమయంలో హైదరాబాద్‌లో వినాయక చవితి మండపాలు, నిమజ్జన ఊరేగింపులు ఉంటాయి. ఈ క్రమంలో బందోబస్తు ఇబ్బందికరం అవుతుందన్న భావన తెలంగాణ పోలీసుల నుంచి వచ్చినట్లు తెలిసింది. అలాంటి పరిస్థితి ఉంటే, ఎపి పోలీసులను ఎక్కువ సంఖ్యలో వినియోగించాలన్న ఆలోచనలో ప్రభుత్వ వర్గాలు ఉన్నాయి. కనీసం ఐదు పని దినాల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తారు.