Home జాతీయ వార్తలు ఎపి అసెంబ్లీ స్పీకర్ కు గాయాలు

ఎపి అసెంబ్లీ స్పీకర్ కు గాయాలు

KODELA

గుంటూరు : ప్రత్యేక హోదా కోసం ఎపి సిఎం, టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు శుక్రవారం ఒక్క రోజు దీక్ష చేయనున్నారు. ఆయన దీక్షకు మద్దతుగా ఎపి అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు గురువారం ఉదయం సైకిల్ యాత్ర చేపట్టారు. నరసరావుపేటలోని తన ఇంటి నుంచి కోటప్పకొండకు ఆయన యాత్రగా బయల్దేరారు. ఈ క్రమంలో యలమంద వద్ద ఓ బైక్ అదుపుతప్పి స్పీకర్ సైకిల్‌ను ఢీకొట్టింది. దీంతో ఆయన సైకిల్‌పై నుంచి కిందపడిపోయాడు. ఈ ఘటనలో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. కొద్దిసేపు సేదదీరిన అనంతరం ఆయన తన సైకిల్ యాత్రను తిరిగి కొనసాగించారు.

AP Assembly Speaker Bicycle Yatra in Narasaraopet