Home జాతీయ వార్తలు కోడెల కడిగిన ముత్యం

కోడెల కడిగిన ముత్యం

DDహైదరాబాద్ : ఎపి అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై గతంలో నమోదైన అన్ని కేసుల నుంచి కడిగిన ముత్యంలా బయటకు వచ్చారని ఎపి మంత్రి పల్లె రఘనాథరెడ్డి తెలిపారు. కోడెల శివప్రసాదరావుపై గతంలో నమోదైన కేసుల గురించి వైకాపా సభ్యుడు రాచమల్లు ప్రసాద్‌రెడ్డి చేసిన ఆరోపణలపై మంత్రి సమాధానమిచ్చారు. తనపై నమోదైన అన్ని కేసుల నుంచి కోడెల క్లీన్‌చిట్‌తో బయటకు వచ్చారని తెలిపారు. సీనియర్ నేతపై ఆరోపణలు చేయడం సరికాదని పేర్కొన్నారు.