Home జాతీయ వార్తలు ముగిసిన ఎపి కేబినెట్ భేటీ

ముగిసిన ఎపి కేబినెట్ భేటీ

CM-BABU

అమరావతి : ఎపి కేబినెట్ భేటీ ముగిసింది. సిఎం చంద్రబాబునాయుడు అధ్యక్షతన బుధవారం జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉద్యోగులకు 2017 నుంచి 2108 మార్చి 31 వరకు 2.096 శాతం డిఎ చెల్లించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వంపై రూ.1048.60 కోట్ల భారం పడనుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ విషయంపై కూడా చర్చించారు. మార్చి 5న రాష్ట్ర బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగం, మార్చి 8న బడ్జెట్ ప్రవేశపెట్టాలని గతంలోనే చంద్రబాబు ప్రకటించారు. అయితే కేబినెట్ దీనిపై కూడా చర్చించి నిర్ణయం తీసుకుంది. పోలవరం ప్రాజెక్టులో కాంక్రీట్ పనులు చేపట్టిన సవయుగ సంస్థకు రూ.1244 కోట్ల పరిపాలన అనుమతులకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎసిబిలో 350 పోస్టులు, గన్నవరం కోర్టులో 25 పోస్టుల భర్తీకి కూడా మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. అంతేకాకుండా వివిధ సంస్థలకు భూ కేటాయింపులకు సంబంధించి కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.

AP Cabinet Meeting held on Wednesday