Search
Monday 24 September 2018
  • :
  • :

షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళుతాం : చంద్రబాబు

AP CM Chandra Babu Comments on Early elections

అమరావతి : ముందస్తు ఎన్నికలపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎపి సిఎం, టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ముందస్తు ఎన్నికలపై స్పందించారు. పార్లమెంట్‌కు ముందస్తు ఎన్నికలు జరిగితే , ఆ ఎన్నికలను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని, అయితే అసెంబ్లీకి మాత్రం షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్తామని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం గుంటూరు టిడిపి నేతలతో భేటీ అయిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచనలో కేంద్రం ఉందని, ఈ క్రమంలో పార్టీ శ్రేణులు ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం అడిగితే, తాము మాత్రం షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళుతామని చెబుతానని ఆయన స్పష్టం చేశారు. మంత్రివర్గ విస్తరణపై కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రివర్గంలోకి ముస్లిం మైనార్టీలను తీసుకోవడంతో ముఖ్యనేతలతో చర్చించారు. దీంతో ఎపి మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందని సమాచారం.

AP CM Chandra Babu Comments on Early elections

Comments

comments