Home ఆంధ్రప్రదేశ్ వార్తలు ఢిల్లీలో చంద్రబాబు దీక్ష

ఢిల్లీలో చంద్రబాబు దీక్ష

ChandraBabu ఢిల్లీ: ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వడంతో పాటు విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎపి సిఎం చంద్రబాబు, మంత్రులు, ఎంపిలు, ఎంఎల్ఎలు, ఎంఎల్ సిలు ఢిల్లీలో చేపట్టిన ధర్మపోరాట దీక్ష సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది.  రాష్ట్ర విభజన సమయంలో ఎపికి న్యాయం కోసం దీక్ష చేసిన వేదిక (ఎపి భవన్‌) నుంచే మరోసారి చంద్రబాబు దీక్ష చేపట్టారు. ఎన్ డిఎ ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన మధ్యంతర బడ్జెట్‌లోనూ ఎపికి మొండిచెయ్యి చూపారు. దీంతో  సిఎం చంద్రబాబు ఈ సారి దిల్లీ వేదికగా ధర్మపోరాట దీక్ష చేయాలని నిర్ణయించి నేడు దీక్ష చేపట్టారు. చంద్రబాబుతో పాటు ఎపికి చెందిన టిడిపి ప్రజా ప్రతినిధులు నల్ల చొక్కాలతో నిరసన వ్యక్తం చేస్తూ ఈ దీక్ష చేస్తున్నారు. ముందుగా ఎపి భవన్‌లో ఉన్న అంబేడ్కర్‌తో పాటు దీక్షా వేదికపై గాంధీ, ఎన్ టిఆర్ చిత్ర పటాలకు చంద్రబాబు నివాళులర్పించారు. రాత్రి 8 గంటల వరకు ఈ దీక్ష కొనసాగనుంది. అనంతరం చంద్రబాబు ప్రసంగించనున్నారు. ఈ దీక్షకు ఎపి ప్రజలు భారీగా తరలివచ్చారు.

AP CM Chandra Babu Inmates at Delhi