Home ఆంధ్రప్రదేశ్ వార్తలు మీ జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం: సిఎం చంద్రబాబు

మీ జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం: సిఎం చంద్రబాబు

AP CM And Sachinఅమరావతి: క్రీడాభిమానుల గుండెల్లో లిటిల్ మాస్టర్ గా చిరస్థాయి ముద్రను సొంతం చేసుకున్న టీమిండియా మాజీ కెప్టెన్‌, క్రికెట్‌ మాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌కు ఎపి సిఎం చంద్రబాబునాయుడు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ట్విట్టర్‌ ద్వారా మాస్టర్ కు విష్ చేశారు. ‘మీ జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం. ఎందరో జీవితాలపై చెరగని ముద్రవేశారు. అది తరతరాలకు నిలుస్తుంది. మీలాంటి వారు కొద్దిమంటే ఉంటారు’ అంటూ బాబు పేర్కొన్నారు. సచిన్ బుధవారం 47వ వసంతంలోకి అడుగుపెట్టాడు.
1973 ఏప్రిల్ 24న మహారాష్ట్రలోని ఓ సాధారణ కుటుంబంలో సచిన్ పుట్టాడు.  ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా సచిన్ అభిమానులు, మాజీ క్రికెటర్లు, రాజకీయ, సినీ ప్రముఖులు బర్త్‌డే విషెస్ చెబుతున్నారు. సచిన్ జన్మదినం సందర్భంగా ముంబయిలోని తన నివాసానికి అభిమానులు భారీగా తరలివచ్చారు. అక్కడి చేరుకున్న ఫ్యాన్స్‌కు అభివాదం చేసిన సచిన్ కొంతమందిని ప్రత్యేకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు.
AP CM Chandrababu Birthday Wishes to Sachin Tendulkar