Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

అవినీతి పట్ల చండశాసనుడిలా ఉంటా…

A P Chief Minister Chandrababu Naidu Fires On YCP And BJP Parties
తూర్పుగోదావరి: తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని జెఎన్టీయు మైదానంలో శుక్రవారం నిర్వహించిన ధర్మపోరాట దీక్షలో  ఎపి సిఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. ఎవరైనా తప్పు చేస్తే వదిలిపెట్టనని, అవినీతిపై చండశాసనుడిలా ఉంటనన్నారు. అగ్రిగోల్డ్‌ ఆస్తులు వేలం వేయించి బాధితులకు న్యాయం చేస్తానని చంద్రబాబు భరోసా ఇచ్చారు. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే వైసిపి అధినేత జగన్ అక్రమాస్తులను స్వాధీనం చేసుకోవాలని బాబు డిమాండ్ చేశారు. అక్రమాస్తులను స్వాధీనం చేసుకునే ధైర్యం బిజెపికి ఉందా..? అని ప్రశ్నించారు. శ్రీవారి నగలు మాయమయినట్టు మాట్లాడుతున్నారని, ఇది బిజెపి, వైసిపి ఆడిన నాటకం కాదా? అని చంద్రబాబు నిలదీశారు. కేంద్ర ప్రభుత్వ పాలన తీరు బాగోలేదని విమర్శలు గుప్పించారు. బ్యాంకులు, ఎటిఎంలలో డబ్బులు లేవని ఇదేం పరిపాలన? అని బాబు మోడీని ప్రశ్నించారు.

Comments

comments