Search
Thursday 15 November 2018
  • :
  • :

చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం

CM-BABU

తూర్పుగోదావరి : కాపులను బిసిల్లో చేరుస్తూ ఎపి ప్రభుత్వం బిల్లును తేవడంపై బిసి సంఘాలు భగ్గుమంటున్నాయి. ఈ క్రమంలో శనివారం బిసి సంఘాలు కాకినాడ కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగి సిఎం చంద్రబాబునాయుడు దిష్టి బొమ్మను దహనం చేశాయి. కాపులను బిసిల్లో చేర్చడం వల్ల వెనుకబడిన తరగతుల వర్గాలకు నష్టం జరుగుతుందని బిసి నేతలు ధ్వజమెత్తారు. తక్షణమే ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. బిసి సంఘాల ఆందోళనతో కాకినాడు కలెక్టరేట్ వద్ద ట్రాఫిక్ స్తంభించింది.

AP CM Chandrababu Effigy Burning

Comments

comments