Home ఆంధ్రప్రదేశ్ వార్తలు తిరుపతికి ఎపి సిఎం… హారతిచ్చిన భువనేశ్వరి

తిరుపతికి ఎపి సిఎం… హారతిచ్చిన భువనేశ్వరి

AP CM Chandrababu Naidu

 

అమరావతి: ప్రస్తుతం ఎపిలో ఎన్నికల కొనసాగుతుంది. ఇందులో భాగంగానే సిఎం చంద్రబాబు సతీసమేతంగా తిరుపతికి బయలుదేరారు. ఆయన సతీమణి భువనేశ్వరి ఆయనకు ఎదురొచ్చి హారతి ఇచ్చారు. చిత్తూరు, శ్రీకాకుళం జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులను ఏకం చేస్తూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు శనివారం ఎన్నికల ప్రచారానికి శంఖారావం పూరించనున్నారు. తిరుమలలో కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్న అనంతరం బాబు తిరుపతిలోని తారక రామ స్టేడియంలో కార్యకర్తలు, పార్టీ శ్రేణులను, సేవా మిత్రలను, అభిమానులతో సభ నిర్వహిస్తారు. విశాఖపట్నం మీదుగా శ్రీకాకుళం వెళ్లి అక్కడి కోడి రామ్మూర్తి స్టేడియంలో బహిరంగ సభలో మాట్లాడుతారు. పార్టీ ఎజెండాను, ప్రభుత్వ చేసిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యతను పార్టీ కార్యకర్తలకు అప్పగించనున్నారు.

AP CM Chandrababu Naidu Visits Tirumala Tirupati