Home సినిమా దాసరిని పరామర్శించిన ఎపి సిఎం చంద్రబాబు, మెగాస్టార్ చిరంజీవి

దాసరిని పరామర్శించిన ఎపి సిఎం చంద్రబాబు, మెగాస్టార్ చిరంజీవి

Dasariఅనారోగ్యంతో కొన్ని రోజులుగా సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ కేంద్రమంత్రి, దర్శకరత్న దాసరి నారాయణరావును ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు. అనం తరం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ దాసరి నారా యణరావు కోలుకుంటున్నారని… త్వరలోనే ఆయన ఆరోగ్య పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంటుందని అన్నా రు. వైద్యులు దాసరికి మెరుగైన చికిత్స అందిస్తున్నారని చెప్పారు. ఇక కిమ్స్ ఆసుపత్రికి  విచ్చేసి దాసరిని మెగా స్టార్ చిరంజీవి పరామర్శించారు. ఈ సందర్భంగా చిరం జీవి వెంట అల్లు అరవింద్, వివి వినాయక్ ఉన్నారు. అనం తరం చిరంజీవి మాట్లాడుతూ “దాసరి ఓ పోరాట యోధుడు. ఆయన ఆత్మవిశ్వాసమే ఆయనను ఆసుపత్రి నుంచి ఆరోగ్యంగా బయటకు నడిపిస్తుంది. మహా అయితే మరో రెండు, మూడు రోజులు ఆయన ఐసియులో ఉంటారు. మరికొద్ది రోజుల్లోనే పూర్తిగా కోలుకుంటారు. ఇక త్వరలో నిర్వహించనున్న ఖైదీ నంబర్ 150 విజయోత్సవ వేడుకకు దాసరి తప్పకుండా హాజరవు తారు”అని అన్నారు. జయసుధ, జయప్రద, మురళీమో హన్, అశ్వినీ దత్‌లు కూడా దాసరిని పరామర్శించారు.