Home తాజా వార్తలు దశలవారీగా ఎపి ఉద్యోగుల రిలీవ్ : నాయిని

దశలవారీగా ఎపి ఉద్యోగుల రిలీవ్ : నాయిని

NAINI

హైదరాబాద్ : తెలంగాణ పోలీస్ శాఖలో పని చేస్తున్న ఎపి ఉద్యోగులను దశలవారీగా రిలీవ్ చేస్తామని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆయన మాట్లాడారు. కమల్‌నాథన్ కమిటీ రిపోర్టు ప్రకారం ఎపికి చెందిన ఉద్యోగులను రిలీవ్ చేస్తున్నామన్నారు. స్పెషల్ బెటాలియన్లలో ఎపికి చెందిన 2,877 మంది తెలంగాణలో పని చేస్తున్నారని పేర్కొన్నారు. దశలవారీగా వారిని రిలీవ్ చేస్తామని ఆయన స్పష్టం చేశారు.