Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

ఘనంగా మంత్రి అఖిలప్రియ నిశ్చితార్థం

AP Minister Bhuma Akhila Priya's Engagement with Industrialist

హైదరాబాద్: ఎపి మంత్రి, దివంగత భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిల కుమార్తె భూమా అఖిలప్రియ నిశ్చితార్థం శనివారం  హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో ఘనంగా జరిగింది. పారిశ్రామిక వేత్త భార్గవ్ను ఆమె పెళ్లాడబోతున్నారు. కుటుంబసభ్యులు, బంధువుల మధ్య ఈ నిశ్చితార్థ కార్యక్రమం వేడుకగా జరిగింది. గత కొంతకాలంగా అఖిలప్రియ, భార్గవ్‌ ప్రేమలో ఉన్నట్లు సమాచారం. వీరి వివాహం ఆగస్టు 29న జరగనుందని సమాచారం. కాగా, భార్గవ్ ఎపి మంత్రి నారాయణ పెద్ద అల్లుడి సోదరుడు. అలాగే ఎపి మాజీ డిజిపి సాంబశివరావుకు కూడా ఈయన బంధువు అవుతారని తెలుస్తోంది.

Comments

comments