Home రాష్ట్ర వార్తలు శ్రీశైలంతో ఎపి చెలగాటం!

శ్రీశైలంతో ఎపి చెలగాటం!

తెలంగాణకు నీరు వదలకూడదనే దుర్బుద్ధితో డ్యాం భద్రతను నిర్లక్ష్యం చేస్తున్న ఇంజినీర్లు

(బి.టి.గోవిందరెడ్డి)

                      SRISAILAM

హైదరాబాద్: తెలంగాణకు నీళ్లు వదలొద్దనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దుర్భుద్ధి శ్రీశైలం ప్రాజెక్టు మనుగడకే ఎసరు తెస్తోంది. శ్రీశైలం రిజర్వాయర్ ఇంజనీర్ల తీరు చూస్తుంటే డ్యాం సేఫ్టీతో గేమ్స్ ఆడుతున్నట్టు కనిపిస్తున్నది. గతంలో 2009 అక్టోబర్ మొద టి వారంలో ఇట్లాగే చేసి డ్యాం కొట్టుకుపోయే పరిస్థితి తీసుకు వచ్చారు. ఆనాటి అనుభవాల రీత్యా డ్యాంసేఫ్టీ మాన్యువల్‌ను తు.చ. తప్పకుండా పాటించాల్సింది పోయి మళ్లీ అటువంటి పనులకే పూనుకుంటున్నారు.ఎగువన అన్నీ డ్యాములు నిండి, క్యాచ్ మెంట్‌లో భారీ వర్షాలు కురుస్తున్నప్పుడు రిజర్వాయర్‌లో కనీసం 20-30 టిఎంసిల ఖాళీ(బఫర్) ఉంచాలి. అంతకన్నా ఎక్కువుంచినా నష్టమేమీ లేదు. ఎందుకంటే ప్రవాహాన్ని కరెక్టుగా అంచనా వేయడం సాధ్యం కాదు. కొన్ని సందర్భాల్లో ఒకసారి వచ్చి పడతాయి. కానీ గతంలోలాగా ఇన్ ఫ్లో రెండు లక్షల క్యూసెక్కులు దాటినా బఫర్ 56 టిఎంసీలు మాత్రమే ఉంచుతున్నారు. ఇది అత్యంత ప్రమాదకర నిర్ణయం.

ఒక చెరువు తెగితేనే తీరని నష్టం. మళ్లీ నిర్మించడానికి ఏండ్లు పట్టే రోజుల్లో దేశం లోని ఐదు భారీ నీటి ప్రాజెక్టుల్లో ఒకటైన శ్రీశైలంతో ఆటలాడుకుంటు న్నా రు. శ్రీశైలాన్ని కేవలం 215 టిఎంసిల రిజర్వాయర్ గా మాత్రమే చూడకూ డదు. దాంతో పాటు 1670 మెగావాట్ల జల విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి. రెండు రాష్ట్రాల జీవనాడి ఇది. ఎగువనుంచి భారీ వరద ప్రవాహం వస్తోందని కేంద్ర జల సంఘం (సిడబ్లుసి) గేజింగ్ పాయింట్ల నుంచి సమాచారం వస్తు న్నపుడు డ్యాంలో కనీసం 10శాతం ఖాళీ ఉంచాలని సేఫ్టీ మాన్యువల్స్ ఘో షిస్తున్నాయి. కానీ పది రోజుల నుంచి కేవలం 4-6 టిఎంసి ఖాళీ మాత్రమే ఉంచుతున్నారు. 2009 సంవత్సరంలో ఇలాగే నీళ్లు వదిలితే మళ్ళీ రావేమో అని నిండా నిల్వ పెట్టారు. కర్నూలు, మంత్రాలయం, మహబూబ్ నగర్, ఎగువన కర్నాటకలో క్లౌడ్ బరస్ట్ అయి ఒక్క రోజులో 50 సెంటీ మీటర్ల వర్షం పడింది.

అప్పటి డ్యాం మెంటల్ ఇంజనీర్లు ఇన్‌ఫ్లో 5-6 లక్షల క్యూసె క్కులు మాత్రమే వస్తాయని భావించి, సులువుగా హ్యాండిల్ చేయవచ్చని ముసుగు తన్ని నిద్ర పోయారు. తీరా చూస్తే 10,15,20 లక్షలు దాటుతూ, ఒక దశలో ఇన్ ఫ్లో 25 లక్షలకు చేరింది. డ్యాం స్పిల్ వే (నీరు వదిలే) సామర్థ్యం 13.6 లక్షల క్యూసెక్కులు మాత్రమే. అప్పటి ఇంజనీర్ల గొప్ప నిర్మాణ కౌశల్యం, నిజాయితీతో సిమెంట్, స్టీల్ లను వాడాల్సినంత వాడిన ఫలితంగా డ్యాం రెండింతల ప్రవాహపు వరవడిని తట్టుకొని నిలబడింది.

అది వందేళ్లలో ఒక సారి వచ్చే వరద. ఆ అనుభవంతో జాగ్రత్త పడాల్సిన ఇంజ నీర్లు ఈ సారి మళ్లీ అత్యాశకు పోయి బఫర్ తగినంత లేకుండా చేసి కొంప ముంచే పనులు చేస్తున్నారు. ముఖ్యంగా జలాశయం ఎగువన 100 కిలో మీ టర్ల పరిధిలో భారీ వర్షాలు కురిసి ఇన్ ఫ్లో లక్షన్నర క్యూసెక్కులు దాటి, ఇం కా పెరగ వచ్చని ముందస్తు సూచనలు ఉన్నప్పుడు అత్యంత జాగ్రత్తతో వ్యవ హరించాలి. శ్రీశైలం డ్యాం నిర్వహణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదీనంలో ఉం ది. నాగార్జున సాగర్ అడ్మినిస్ట్రేషన్ తెలంగాణా ప్రభుత్వ పరిధిలో ఉంది. దా నితో శ్రీశైలం పూర్తిగా నిండి ఇన్ ఫ్లోలో భారీగా వస్తున్నా బఫర్ పెట్టుకోవడా నికి వెనకాడుతున్నారు. భారీ నీటి ప్రాజెక్టులు ఏ ఒక్క రాష్ట్రం సొత్తు కాదు. అది జాతి సంపద. డ్యాం సేఫ్టీ మాన్యువల్ ను ఖచ్చితంగా పాటించాలి.