Home జాతీయ వార్తలు స్ఫూర్తిదాత కలాం : జగన్

స్ఫూర్తిదాత కలాం : జగన్

APJ-ABDUL-KALAMహైదరాబాద్ : భారత రత్న, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం స్ఫూర్తి దాత అని, ఆయన స్ఫూర్తి ఎప్పటికీ అలాగే నిలస్తుందని వైకాపా చీఫ్ జగన్‌మోహన్‌రెడ్డి కొనియాడారు. కలాం జయంతిని పురస్కరించుకుని, ట్విట్టర్ ద్వారా ఆయన నివాళులు అర్పించారు. అబ్దుల్ కలాం పుట్టినరోజును ప్రపంచ విద్యార్థుల దినోత్సవంగా పరిగణించాలని ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. 2015 జులై 27న షిల్లాంగ్‌లోని ఐఐఎంలో జరిగిన ఓ సెమినార్‌లో ప్రసంగిస్తూ అబ్దుల్ కలాం కుప్పకూలారు. అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిశారు. కలాం 1931 అక్టోబర్ 15న తమిళనాడులోని రామేశ్వరంలో జన్మించారు.