Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

ఎదురెదురుగా ఆర్‌టిసి బస్సుల ‘ఢీ’

bus-accident-image

మహిళ మృతి పలువురికి గాయాలు 8 డ్రైవర్లకు స్వల్వ గాయాలు

మనతెలంగాణ / కందుకూరు: ఎదురెదురుగా వెళ్తున్న  రెండు ఆర్‌టిసి బస్సులు ఢీకొని  మహిళా మృతి చెందగా, పలువురికి తీవ్రగాయాలైన సంఘటన కందుకూరు మండల పరిధిలోని దెబ్బడగూడ గేటు సమీపంలో శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారిపై చోటుచేసుకుంది.  ఈ సంఘటనలో పలువురికి తీవ్రగాయాలు కాగా రెండు బస్సులు ముందు భాగం పూర్తిగా ధ్వంసమయ్యాయి. కందుకూరు సిఐ బి. భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం శ్రీశైలం నుంచి హైదరాబాద్ వస్తున్న  టిఎస్ 07 జడ్ 4055 సూపర్ లగ్జరి బస్సు, హైదరాబాద్ నుంచి కల్వకుర్తి వైపు వస్తున్న  టిఎస్ 06 యుఎ9549 ఎక్స్‌ప్రెస్ బస్సులు వెళ్తుండగా మార్గం మధ్యలో శ్రీశైలం  హైద్రాబాద్ ప్రధాన రహదారి అయిన దెబ్బడగూడ గేటు సమీపంలో రెండు బస్సులు బలంగా ఢీకొన్నాయి. సంఘటన స్థలంలో మహిళ మృతి చెందగా, గాయపడిన వారిని ప్రథమ చికిత్స నిమిత్తం కందుకూరు మండల కేంద్రానికి తీసుకెళ్ళారు. బస్సు డ్రైవర్లు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.  ప్రయాణికులకు గాయాలు తీవ్రంగా వున్నవారిని  హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.  గాయపడినవారు కానికరం హరిక, చింత వెంకటమ్మ, కె. రాజేష్, నారమ్మ, రాంపాల్ సింగ్, అన్విర్, పాతిమా,  అసిమా బేగం, ఆసిఫ్‌లతో పాటు ఇద్దరు చిన్నారులు వున్నారని తెలిపారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియరాలేదని రెండు బస్సుల డ్రైవర్లు పరారీలోవున్నట్లు తెలిపారు.

Comments

comments