Search
Saturday 22 September 2018
  • :
  • :

‘అపార్ట్‌మెంట్’లో పాటల సందడి

movieశ్రీ క్రియేటివ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో నిఖిత ప్రధాన పాత్రలో శివగంగరాజు పుడిమూడి దర్శకత్వంలో ఎ.కె.శ్రీకాంత్ అంగళ్ల నిర్మించిన సస్పెన్స్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘అపార్ట్‌మెంట్’. ఖుద్దూస్ ఎస్.ఎ. సంగీత సారధ్యంలో రూపొందిన ఆడియోను ఆర్పీ పట్నాయక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ “సినిమా పాటలు విన్నాను. చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమా మంచి విజయం సాధించి యూనిట్‌కు మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. మ్యూజిక్ డైరెక్టర్ ఖుద్దూస్‌కు ఈ సినిమా ద్వారా మంచి బ్రేక్ వస్తుందని ఆశిస్తున్నాను”అని అన్నారు. దర్శకుడు శివగంగరాజు వుడిమూడి మాట్లాడుతూ “ఒక అపార్ట్‌మెంట్ కల్చర్‌లోకి ప్రవేశించిన ఒక అమ్మాయి అక్కడ ఎలాంటి అనుభవాలను ఎదుర్కొందన్నదే ఈ చిత్ర ఇతివృత్తం. ఖుద్దూస్ మంచి పాటలతో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను అద్భుతంగా ఇచ్చాడు”అని తెలిపారు. నిర్మాత ఎ.కె.శ్రీకాంత్ అంగళ్ల మాట్లాడుతూ “దర్శకుడికి తొలి చిత్రమే అయినా చాలా చక్కగా తెరకెక్కించాడు. ఖుద్దూస్ సంగీతం హైలైట్‌గా ఉంటుంది”అని అన్నారు. ఈ కార్యక్రమంలో నిఖిత, సంగీత దర్శకుడు ఖుద్దూస్‌తో పాటు చిత్ర బృందం పాల్గొంది.

Comments

comments