Home వార్తలు ఆగస్టులో రాబోతున్న ‘అపార్ట్‌మెంట్’

ఆగస్టులో రాబోతున్న ‘అపార్ట్‌మెంట్’

appartmentశ్రీ క్రియేటివ్ ఫిలిమ్స్ పతాకంపై నిఖిత ప్రధాన పాత్రలో శివగంగరాజు వుడిమూడి దర్శకత్వంలో ఎ.కె.శ్రీకాంత్ అంగళ్ల నిర్మించిన సస్పెన్స్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘అపార్ట్‌మెంట్’. ఈ చిత్రం ఇటీవలే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఎ.కె.శ్రీకాంత్ అంగళ్ల మాట్లాడుతూ “ఇదొక సస్పెన్స్‌తో కూడుకున్న మంచి ఎంటర్‌టైనర్. నిఖిత పాత్ర ఈ చిత్రంలో హైలైట్‌గా ఉంటుంది. అలాగే మిగతా పాత్రల్లో సంజన, ఉత్తేజ్, చిన్నా వంటి వారు ఈ మూవీలో అద్భుతంగా నటించారు. అలాగే మా సంగీత దర్శకుడు ఖుద్దూస్ ఎస్.ఎ. స్వరపరిచిన పాటలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ కానున్నాయి. రిథమ్ స్టూడియోలో ప్రస్తుతం డబ్బింగ్, ఎడిటింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఆగస్టులో   ఆడియోను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. అదే నెల చివరి వారంలో సినిమాను రిలీజ్ చేస్తాం”అని అన్నారు. విజయ్‌సాయి, రక్ష, అల్లరి సుభాషిణి, ప్రియాంక తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరాః సాబు జేమ్స్, ఎడిటర్‌ః నాగిరెడ్డి.