Home వార్తలు ఎన్నారై యువకుడిగా కనిపిస్తా

ఎన్నారై యువకుడిగా కనిపిస్తా

సాగర్,  నంద్వాణి, సాక్షి చౌదరి హీ రోహీరోయిన్‌లుగా లంకాల బుచ్చిరెడ్డి సమర్పణలో రామదూత క్రియేషన్స్ బ్యానర్‌పై కె.వి.దయానంద్ రెడ్డి దర్శకత్వంలో దాసరి కిరణ్‌కుమార్ నిర్మించిన చిత్రం ‘సిద్ధార్థ’. శుక్రవారం ఈ చిత్రం విడుదలకానుంది. ఈ సందర్భంగా హీరో సాగర్‌తో ఇంటర్వూ విశేషాలు…

sagarఫ్యాక్షన్ స్టోరీ…
ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే లవ్‌స్టోరీ ‘సిద్ధార్థ’. ఈ చిత్రంలో ఓ ఎన్నారై యువకుడిగా కనిపిస్తాను. ఆ యువకుడు అనంతపూర్‌కు ఎందుకు వెళ్తాడు… ఏం చేస్తాడనేదే సినిమా.
హీరోయిన్లకూ ప్రాముఖ్యత…
సాధారణంగా కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్లకు అంతగా ప్రాముఖ్యత ఉండదు. కానీ ఈ సినిమాలో రాగిణి, సాక్షి చౌదరిలకు వారి పాత్రల పరంగా మంచి ప్రాముఖ్యత ఉంటుంది. సినిమా చూసిన ప్రేక్షకులకు వారి పాత్రల ప్రాధాన్యత తెలుస్తుంది.
మంచి విజయాన్ని అందుకుంటా…
సినిమా అద్భుతంగా రూపుదిద్దుకుంది. పరుచూరి బ్రదర్స్, మణిశర్మ, దయానంద్ రెడ్డి, దాసరి వంటి ఓ మంచి టీం నాకు టాలీవుడ్‌లో ఓ మంచి స్థానాన్ని కల్పించే ఆలోచనతో చేసిన సినిమా ఇది. ఈ చిత్రంతో నేను మంచి విజయాన్ని అందుకుంటానన్న నమ్మకముంది.
అన్ని శాఖలపై ఆయనకు పట్టు ఉంది..
నిర్మాత దాసరి కిరణ్‌కుమార్ మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్. ఓ సినిమాకు ప్రేక్షకులు ఎలా స్పందిస్తారు….ఏ ఎలిమెంట్స్ సినిమాలో ఉండాలి… ఇలా అన్ని శాఖలపై మంచి పట్టు ఉంది ఆయనకు. సినిమా నిర్మాణంలో ఏవిధంగానూ రాజీపడకుండా ‘సిద్ధార్థ’ను ఆయన తెరకెక్కించారు.
ఇక్కడా రాణిస్తా…
నేను సీరియల్స్ చేయడం లేదు. ఇక సీరియల్స్, సినిమాకు నటనాపరంగా పెద్ద తేడా లేదు. అయితే టెక్నికల్‌గా మాత్రం చాలా తేడా ఉంటుంది. బుల్లితెరపై రాణించిన నేను సినీ రంగంలోనూ రాణిస్తానన్న నమ్మకముంది.
ఆ ఆలోచనే నన్ను నడిపించింది…
సినిమాల్లోకి నేను పూర్తిగా రావాలనుకోలే దు. ముందుగా ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’ సినిమాలో చిన్న పాత్ర చేశాను. అయితే నన్ను ఇష్టపడే ప్రేక్షకులు నా నుండి చిన్న పాత్రలను ఆశించడం లేదని… నేను తప్పు చేశాననిపిం చింది. ఆ ఆలోచనే నన్ను ‘సిద్ధార్థ’ సిని మా వైపు నడిపించింది. ఈ సినిమా కోసం ఒక సంవ త్సరంపాటు నాబాడీ లాంగ్వేజ్ విష యంలో చాలా కష్టపడ్డాను.
డిఫరెంట్
ఇమేజ్ చట్రంలో నేను ఇరుక్కోవాల నుకోవడం లేదు. మంచి నటుడిగా రా ణించి… దర్శకనిర్మాతల హీరోగా పేరు తెచ్చుకోవాలని అనుకుంటున్నాను. అం దుకని ఒక తరహా సినిమాల్లో కాకుండా డిఫరెంట్ సినిమాలను చేయాలనుకుంటు న్నాను.
పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా చేయనున్నా…
నా నెక్ట్ మూవీ టైటిల్ ‘హరి’. పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనపడతాను. అవ్యక్త్ ఫిలింస్, రామదూత క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందు తుంది. ‘సిద్ధార్థ’ విడుదలైన తర్వాత ఈ సినిమా లాంఛనంగా ప్రారంభ మవుతుంది.