Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

ఐఫోన్-8 విడుదల.. తగ్గనున్న ఐఫోన్ల ధరలు!

I-Phone-8

మార్కెట్ లోకి ఎన్ని కంపెనీల నుంచి ఎన్ని రకాల మొబైల్స్ వచ్చినా.. యాపిల్ ఐఫోన్ కి ఉన్న క్రేజ్ ముందు మిగితావన్నీ దిగదుడుపే.. యూత్ మాత్రమే.. కాదు.. ప్రతీ ఒక్కరికీ ఒక్కసారైనా ఐఫోన్ వాడాలనే కోరిక ఉంటుంది. ఐఫోన్ ధర ఎంత ఎక్కవగా ఉన్న కూడా దాన్ని ఖరీదు చేయడంలో మాత్రం వెనుకాడరు.. అసలు విషయానికొస్తే.. త్వరలో యాపిల్ నుంచి ఐఫోన్-8 మొబైల్ విడుదల కానుంది. ఈ నెల 12న ఐఫోన్ లో తర్వాతి వర్షన్ ఐఫోన్-8 మార్కెట్ లో అందుబాటులోకి రానుంది.

ఐఫోన్‌ 8తో పాటు ఐఫోన్‌ 7ఎస్‌, ఐఫోన్‌ 7ఎస్‌ ప్లస్‌ స్మార్ట్‌ఫోన్లను ఆపిల్‌ లాంచ్‌ చేయబోతుందని తెలుస్తోంది. అయితే ఈ కొత్త ఫోన్ల విడుదల నేపథ్యంలో పాత ఐఫోన్ మోడల్స్ పై వివిధ ఈకామర్స్ సైట్లలో పెద్ద ఎత్తున డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించాయి. పెటిఎం మాల్ లో ఐ ఫోన్ 7 వేరియట్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు ఇవ్వనుంది. ఐఫోన్‌ 7ను అతి తక్కువగా డిస్కౌంట్‌ ధరలో రూ.39,479కే విక్రయించుతోంది. ఐ ఫోన్ 7 మాత్రమే కాక.. ఐఫోన్ 7 ప్లస్, 6, 6ఎస్ ఫ్లస్ ల పై భారీ డిస్కౌంట్ లను అందిస్తున్నట్లు పేర్కొంది.

ఇక ఐఫోన్ 8 విషయానికొసే.. ఇందులో తొలిసారిగా ఫింగర్ ప్రింట్ స్కానర్ ని తొలగించి దాని స్థానంలో.. 3డీ సెన్స‌ర్స్ అమ‌ర్చి, ముఖ క‌వ‌లిక‌ల ఆధారంగా గుర్తించే ఫీచ‌ర్‌ను యాడ్ చేశారు. కొత్త‌గా రానున్న మూడు మోడ‌ల్స్‌లో ఒక‌దాంట్లో ఒఎల్ఈడి డిస్‌ప్లే ఉండే అవ‌కాశం ఉంది. ఇక రానున్న ఐఫోన్ ధరపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఐఫోన్  7 ధర ఆధారంగా ఐఫోన్ 8 ధరను విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కానీ ఐఫోన్ 8కి సంబంధించి పూర్తి వివరాలు తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే..

Comments

comments