Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

యాపిల్ క్యాంపస్ ప్లేస్‌మెంట్స్

 హైదరాబాద్ విద్యార్థులకు మొదటి అవకాశం 

Apple

హైదరాబాద్ : సమాచార సాంకేతిక రంగం లో ప్రపంచంలో అత్యధిక ఆదాయాన్ని సంపాదిస్తున్న యాపిల్ సంస్థ ఉద్యోగవకాశాలను మోసుకొచ్చింది. శాంసంగ్ తర్వాత అత్యధిక ఫోన్ల తయారీ సంస్థ యాపిల్‌లో ఉద్యోగాలు ఇచ్చేందుకు భారతదేశానికి మొదటిసారి వ స్తుండగా అందులోనూ ఆ సంస్థ హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్  ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ (ట్రిఫుల్ ఐటి) ని ఎంచుకుంది. భారతీయ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులను ప్రాంగణ నియామకాలు (క్యాంపస్ ప్లేస్‌మెంట్) కల్పించాలని ఆ సంస్థ నిర్ణయించిన తర్వాత మొదటిసారిగా హైదరాబాద్‌లో చదివిన విద్యార్థులను ఎంపిక చేయబోతోంది. యాపిల్ ప్రాంగణ నియామకాలు చేపట్టాలని తీసుకున్న నిర్ణయం పట్ల ట్రిఫుల్ ఐటి  ప్లేస్‌మెంట్స్ అధిపతి టి.వి. దేవి ప్రసాద్ సంతోషం వ్య క్తం చేశారు. ఎలాంటి కేడర్ ఉద్యోగాల కోసం ప్రాంగణ నియామకాలు చే స్తారనే సమాచారం లేకపోయినప్పటికీ ఇంజనీరింగ్ డిగ్రీ చదివిన విద్యార్థుల కోసం ఈ నియమకాలు చేపడతారని ఆయన తెలిపారు. విద్యార్థులు యాపిల్ సంస్థ ప్రతినిధుల ముందు తమ ప్రతిభను చదివిన కళాశాలలోనే ప్రదర్శించుకునేందుకు ఇది మంచి అవకాశమన్నారు. హైదరాబాద్‌తో పా టు బెంగళూరులో కూడా ప్రాంగణ నియామకాలు చేపట్టవచ్చన్నారు. ట్రి పుల్ ఐటితో నమోదు చేసుకున్న వాటిలో యాపిల్‌తో పాటు మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫిలిప్స్ తదితర కంపెనీలున్నాయాన్నారు. ప్రాంగణ నియామకాల కోసం ఇప్పటికే బి.టెక్, బిఇ, ఎం.టెక్, ఎం.ఎస్‌సి (రీసర్చ్) విద్యార్థులు 350 మంది పేర్లను నమోదు చేసుకున్నారని, ప్లేస్‌మెంట్స్ డిశంబర్‌లో ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు.

కృత్రిమ మేధస్సు, డాటా సైన్స్, ఆటోమేషన్, లోతైన అధ్యయనం తదితర అవసరాలను తీర్చుకునేందుకు కంపెనీలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నాయని కొంత మంది అధికారులు తెలిపారు.  నియామకం కోసం జరిపే ఇంటర్వూ సాంకేతికాంశాలపై సాగుతుందని, ఇందులో అభ్యర్తి కంప్యూటింగ్ భాషా పరిజ్ఞానం (పైథాన్)కు ప్రాధాన్యత ఉంటుందని, ఎక్కువ కంపెనీలు ఉత్పత్తుల అభివృద్ధి, పరిశోధన, డెవలప్‌మెంట్ ప్రొఫైల్స్ కోసం ఉద్యోగాల కల్పన చేస్తున్నాయని ప్రసాద్ అన్నారు. ఈ సంవత్సరం పలు హార్డ్‌వేర్ కంపెనీలు కూడా అవకాశం ఇచ్చేలా చూస్తున్నామన్నారు.సామూహిక అప్లికేషన్ సర్కూట్, డిజైన్ తనిఖీ పరిజ్ఞానం కలిగిన విద్యార్థులకు కూడా మంచి అవకాశాలుంటాయన్నారు. మొబైల్ కమ్యూనికేషన్‌లో 2డి, 3డి గ్రాఫిక్స్‌పై అవగాహన కలిగిన వారికి మంచి డిమాండ్ ఉందని ప్రసాద్ వివరించారు. హార్డ్‌వేర్ రంగంలో సైన్‌పొసిస్, శాంసంగ్, ఎన్‌విడియ, క్వాల్‌కమ్, మైక్రోసెమి కం పెనీల్లో తమ విద్యార్థులకు అవకాశాలు కల్పించాలని ట్రిబు ల్ ఐటి భావిస్తున్నది. హెచ్ 1బి వీసా పొందడం సంక్లిష్టంగా మారి, విదేశీ కంపెనీలు తమ దేశవాసులకు అవకాశాలు కల్పించాలని నిర్ణయించిన సమయంలో యాపిల్ ట్రిబుల్ ఐటితో ఒప్పందం చేసుకోవడం  కలిసొచ్చే అవకాశమే.

Comments

comments