Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

యాపిల్ సిఇఒ టిమ్ కుక్ జీతంలో కోత

Appleన్యూయార్క్: ఎంతటి వారికైనా పరిస్థితులు బాగులేకపోతే జీతాల్లో కోతలు తప్పవు. ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ సిఇఒ టిమ్ కుక్ వేతనంలో కోత పడింది. ఐఫోన్ తయారీ సంస్థకు ఆశించినంతగా ఆదాయం, లాభాలు గత ఏడాదిలో లేకపోవడంతో కుక్ పరిహారం తగ్గింది. గత సంవత్సరం 2016లో టిమ్ కుక్ ఆర్జించిన మొత్తం పరిహారం 8.75 మిలియన్ డాలర్ల(రూ.59 కోట్లకుపైగా)గా ఆపిల్ పేర్కొంది. సెక్యురిటీ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్‌కు సమర్పించిన ప్రకటనలో సంస్థ పేర్కొంది. ఆయన జీతం 1 మిలియన్ డాలర్లు పెరిగినప్పటికీ, ఏడాదికి ఆయనకు అందే పరిహారం మాత్రం తగ్గినట్టు వెల్లడించింది. అయితే 2015లోటిమ్ కుక్ 10.28 మిలియన్ డాలర్ల(రూ.69 కోట్లకు పైగా) ఆదాయన్ని ఆర్జించడం విశేషం. గత 15 ఏళ్లలో మొదటిసారి యాపిల్ తన రెవెన్యూలను కోల్పోయింది. కంపెనీ వార్షిక విక్రయాలు దాదాపు 4 శాతం మందగించడం వల్ల యాపిల్ సిఇఒ పరిహారంలో కోత పడినట్టు తెలుస్తోంది. 223.6 బిలియన్ డాలర్లగా పెట్టుకున్న లక్ష్యాన్ని కంపెనీ చేధించలేకపోగా.. నిర్వహణ ఆదాయం 0.5 శాతం పడిపోయింది. మొత్తంగా 2016లో కంపెనీ నికర విక్రయాలు, నిర్వహణ ఆదాయాలు 7.7 శాతం, 15.7 శాతం పడిపోయినట్టు ఆపిల్ పేర్కొంది. ఇది ఎగ్జిక్యూటివ్ పరిహారంపై ప్రభావం చూపినట్టు సంస్థ తెలిపింది. టిమ్ కుక్ జీతం పెరిగినప్పటికీ పరిహారం తగ్గింది. గతంలోనూ పలువురు సిఇఒల జీతాల్లో కోత విధించిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా టెక్ దిగ్గజం యాపిల్‌కు కూడా ఈ పరిస్థితి వచ్చింది. యాపిల్ విక్రయాలు గత సంవత్సరంలో గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. 2016 సంవత్సరంలో టిమ్ కుక్ 1.26 మిలియన్ల యాపిల్ షేర్లు అందుకోగా.. దీనిలో ఎక్కువ భాగం అంతముందు సంవత్సరానికి చెందినవే ఉన్నాయి. ఈ స్టాక్స్ విలువ 136.1 మిలియన్ డాలర్లుగా ఉంది. 2016లో కుక్ ఎలాంటి స్టాక్స్ అందుకోలేదని ఎస్‌ఇసి వెల్లడించింది.

Comments

comments