Home జాతీయ వార్తలు కేరళకు ఆపిల్ సంస్థ విరాళం

కేరళకు ఆపిల్ సంస్థ విరాళం

Apple Donates Rs 7 Crore for Kerala's Flood Victims

ఢిల్లీ : భారీ వర్షాలతో కేరళ అతలాకుతలమైన విషయం తెలిసింది. వర్షాలు, వరదల కారణంగా సుమారు 400 మంది చనిపోయారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. భారీ వర్షాల నుంచి కేరళ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. ఈ క్రమంలో కేరళకు ఆపన్న హస్తం అందించేందుకు ప్రపంచ దేశాలు ముందుకొస్తున్నాయి. టెక్ దిగ్గజ కంపెనీ ఆపిల్ కేరళకు రూ.7కోట్ల విరాళాన్ని ప్రకటించింది. కేరళ వరదలు తమను విషాదంలో ముంచాయని ఆపిల్ సంస్థ ఆవేదన వ్యక్తం చేసింది. ఆపిల్ స్టోర్, ఐట్యూన్స్ స్టోర్‌లు కేరళకు విరాళాలు కోరుతూ తమ హోమ్‌పేజీలో బ్యానర్‌ను పోస్టు చేశాయి.

Apple Donates Rs 7 Crore for Kerala’s Flood Victims