Search
Thursday 22 November 2018
  • :
  • :
Latest News

ఐఫోన్ల పై భారీ ఆఫర్

 Apple giant offers on iPhone 8 plus phones

ఢిల్లీ: టెక్నాలజీ దిగ్గజం యాపిల్ తన అభిమానులకు శుభవార్త తెచ్చింది. ఐఫోన్ ఎక్స్, ఐఫోన్ 8 ప్లస్ ఫోన్ల పై యాపిల్ బ్రహ్మాండమైన ఆఫర్లు ప్రకటించింది. అతి తక్కువ వడ్డీతో, జీరో డౌన్ పేమెంట్, ఈఎంఐ స్కీములతో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశంలోని ఆఫ్‌లైన్ లో అందరి రిటైలర్ల వద్ద ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని పేర్కొంది. ఈ ఆఫర్ ఐఫోన్ 7, ఐఫోన్ 7ప్లస్, ఐఫోన్ 8, ఐఫోన్ 8ప్లస్, ఐఫోన్ ఎక్స్‌లకు  వర్తిస్తుందని తెలిపింది.  ఈ ఆఫర్ 18 నెలల ఈఎంఐ ప్లాన్స్‌కు మాత్రమే వర్తిస్తుందని యాపిల్ స్పష్టం చేసింది. దేశంలోని అన్ని బ్యాంకుల క్రెడిట్, డెబిట్ కార్డులకూ ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. ఈ ఆఫర్  జూన్ 15 నుంచి సెప్టెంబరు 30 మధ్య వినియోగదారులకు  అందుబాటులో ఉంటుందని  యాపిల్ స్పష్టం చేసింది.

Comments

comments