Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

భారత్‌పైనే యాపిల్ దృష్టి.. భారీ అవకాశాలున్నాయి…

Apple-is-focused

న్యూయార్క్: భారత్ మార్కెట్‌పై మొబైల్ దిగ్గజం యాపిల్ సంస్థ దృష్టి పెట్టింది. ఇదే విషయాన్ని యాపిల్ సిఇఒ టిమ్ కుక్ చెప్పారు. భారత్‌లో మార్కెట్ పెంచుకోవడంపై తాము దృష్టి పెట్టామని, తమ ఉత్పత్తులను రిటైల్‌తో సహా అంతటా లాంచ్ చేస్తామని ఆయన అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా భారత్ మూడో అతిపెద్ద మార్కెట్.. ఇక్కడ అపారమైన అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. భారత్‌లో తాము చాలా తక్కువ మార్కెట్‌ను కలిగి ఉన్నామని అన్నారు. 2018 రెండో త్రైమాసిక ఫలితాలను వెల్లడించే సమయంలో టిమ్ కుక్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఫలితాల్లో యాపిల్ త్రైమాసిక ఆదాయం 61.1 బిలియన్ డాలర్లను నమోదు చేసింది. గత ఏడాదితో పోలిస్తే 16 శాతం వృద్ధిని సాధించింది. మార్చి ముగింపు ఫలితాలను తమ కంపెనీకి చాలా ఉత్తమమైనవని.. ఐఫోన్, సర్వీసెస్, వేరియెబుల్స్‌లో పటిష్టమైన రెవెన్యూ వృద్ధిని సాధించామని తెలిపారు. భారత్‌లో మార్కెట్‌ను పెంచుకునేందుకు తాము తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని, ఆ దిశగా పనులు వేగవంతం చేశామని కుక్ తెలిపారు.గతంలో భారత్‌లో పర్యటించిన సిఇఒ టిమ్ కుక్ ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమానికి సానుకూలంగా స్పందించారు.

Comments

comments