Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

చిన్నారులకు యాపిల్ జ్యూస్ తో ఎంతో మేలు

apple_juiceచిన్నారులకు యాపిల్ జ్యూస్ ఎంతో మేలు చేస్తుంది. చిన్నారుల్లో డీహ్రైడేషన్ , ఉదరకోశ సమస్యలకు యాపిల్ జ్యూస్ బాగా పని చేస్తుందని, ఇతర ద్రావణాలకంటే యాపిల్ రసాన్ని ఇవ్వడం మంచిదని సైంటిస్టులు చెబుతున్నారు. ఇతర ద్రావణాలు తాగిన పిల్లలతో పోల్చినప్పుడు పలుచటి యాపిల్ జ్యూస్ తాగిన చిన్నారుల్లో ఉదరకోశ వ్యాధులు,డీహైడ్రేషన్ తగ్గినట్లు వారు పేర్కొన్నారు. చిన్నారుల్లో ఉదర సమస్యలు సాధారణం. వీటికి చికిత్సగా వైద్యులు ఓఆర్‌ఎస్, ఇతర ఎలక్ట్రోలైట్ ద్రావణాలను సిఫార్సు చేస్తుంటారు. కెనడాలోని కాల్గరీ యూనివర్సిటీ సైంటిస్టులు డీహైడ్రేషన్, ఉదర సమస్యలతో ఇబ్బంది పడుతున్న 6 నెలల నుంచి 60 నెలల దాకా వయస్సు ఉన్న 647 మంది చిన్నారులపై అధ్యయనం చేశారు. వీరిలో యాపిల్ జ్యూస్ తీసుకున్నవారి పరిస్థితి మెరుగ్గా ఉన్నట్లు గుర్తించారు. ఈ అధ్యయనం వివరాలను జామా పత్రిక ఇటీవల వెల్లడించింది.

Comments

comments