Search
Wednesday 14 November 2018
  • :
  • :

బెంగళూరులో యాపిల్ తయారీ కేంద్రం

appleబెంగళూరు : అమెరికాకు చెందిన ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ సంస్థ యాపిల్ ఇక నుంచి మేడ్ ఇన్ ఇండియా ఐఫోన్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది. ఈ కంపెనీ బెంగళూరులో ఫ్యాక్టరీని నెలకొల్పనుంది. కర్ణాటక రాష్ట్రంలో తయారీ కేంద్రం ప్రారంభించాలనే ఐఫోన్ ప్రతిపాదనను ఆ రాష్ట్రం స్వాగతించింది. ఈమే రకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఓ ప్రకటన చేసింది. బెంగళూరు నగరంలో ఏప్రిల్ చివరి నాటికి ఐఫోన్ల తయారీ ప్రారంభమవుతుందని కర్ణాటక ఐటి మంత్రి వెల్లడించారు. యాపిల్ ఐఫోన్లను భారత్‌లో అసెంబుల్ చేసేందుకు యూనిట్ ఏర్పాటు చేయనుందని కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ యూనిట్ కర్ణాటకలో ఏర్పాటుకానున్నట్లు స్పష్టమైంది. యాపిల్ సంస్థ తైవాన్‌కు చెందిన విస్ట్రోన్ కార్పొరేషన్‌తో కలిసి సంయుక్తంగా బెంగళూ రులో అసెంబుల్ పాయింట్ ఏర్పాటు చేయనుంది. ఈ విషయంపై యాపిల్ నుంచి ఎలాంటి ప్రకటన లేదు.

Comments

comments