Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

హైదరాబాద్‌లో యాపిల్ మ్యాప్‌ను ప్రారంభించిన టిమ్‌కుక్

timహైదరాబాద్: ఐటీ దిగ్గజం ‘ యాపిల్ ’ టెక్నాలజీ అభివృద్ధి కేంద్రాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించింది. భారతదేశంలో తొలిసారిగా పర్యటిస్తున్న యాపిల్ అధినేత టిమ్‌కుక్ గురువారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సమక్షంలో కుక్ మ్యాప్స్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కేంద్రం ద్వారా 4వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు కల్పించనున్నారు. అమెరికా వెలుపల ప్రపంచంలోనే మొదటిసారి యాపిల్ సంస్థ తన సాంకేతిక ఆవిష్కరణ కేంద్రాన్ని మొట్టమొదటి సారిగా హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేయడం విశేషం. ఈ సందర్భంగా టిమ్‌కుక్ మాట్లాడుతూ… హైదరాబాద్‌లో తమ కేంద్రాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. హైదరాబాద్ కేంద్రం ద్వారా త్వరలో భాగస్వాములు, విశ్వవిద్యాలయాలతో కలిసి తమ సేవలను విస్తరిస్తామని అన్నారు. అయితే దీనికి సంబంధించిన పెట్టుబడుల వివరాలను మాత్రం టిమ్ వెల్లడించలేదు. ఈ కేంద్రంలో తొలుత 150 మంది నిపుణులు పనిచేస్తారని తెలిపారు. అనంరతం తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడుతూ..హైదరాబాద్‌లో యాపిల్ మ్యాప్స్ కేంద్రం ఏర్పాటు చేయడం గర్వకారణమన్నారు. యాపిల్ మ్యాప్ కేంద్రం ద్వారా వేలాది మంది ఉద్యోగాలు లభిస్తాయన్నారు.

tim-2

Comments

comments