Search
Friday 16 November 2018
  • :
  • :

25న భారత్‌కు రానున్న యాపిల్ బృందం

appleన్యూఢిల్లీ:  అంతర్జాతీయ టెక్ దిగ్గజం యాపిల్ సంస్థ నుంచి ఓ బృం దం త్వరలో భారత్‌కు రానుంది. దేశీయ వివిధ మంత్రిత్వశాఖ ఉన్న తాధికారులతో ఈనెల 25న సమావేశం కానుంది. అలాగే ఐటీ, ఆర్థిక శాఖ అధికారులను కలిసి.. ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించిన అంశా లపై చర్చించనుంది. భారత్‌లో తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ఐఫోన్ల తయారీ సంస్థ యాపిల్ రాయితీలను కోరుతోంది. దీనికి గాను వాణిజ్య, పరిశ్రమలశాఖ గతంలో విముఖత వ్యక్తం చేశాయి.  అనేక పన్నురాయితీలను యాపిల్ కోరుతోంది. ముఖ్యంగా దీర్ఘకాలంలో వీటిని ఇవ్వాలని యాపిల్ కోరడంతో కేంద్ర ఇందుకు అంగీకరించలే దు. అయితే ఎలాంటి అదనపు ప్రయోజనాలు ఆశించకుండానే భార త్‌లో ప్లాంట్ ఏర్పాటు చేయాలని యాపిల్ యోచిస్తోందని సమాచా రం. చైనాకు చెందిన హువాయ్, జియోమి వంటి సంస్థలు రాయితీలు లేకుండానే భారత్‌లో ప్లాంట్లను ఏర్పాటు చేసుకున్నాయి. ఇలాంటివి సుమారు 42కు పైగా కంపెనీలు ఉన్నాయని తెలుస్తోంది. గత 15 ఏళ్లలో మొదటిసారి యాపిల్ తన రెవెన్యూలను కోల్పోయింది. కంపెనీ వార్షిక విక్రయాలు దాదాపు 4 శాతం మందగించడం వల్ల యాపిల్ సిఇఒ పరిహారంలో కోత పడినట్టు తెలుస్తోంది. నిర్వహణ ఆ దాయం 0.5 శాతం పడిపోయింది. మొత్తంగా 2016లో కంపెనీ నిక ర విక్ర యాలు, నిర్వహణ ఆదాయాలు 7.7 శాతం, 15.7 శాతం పడిపో యినట్టు ఆపిల్ పేర్కొంది.

Comments

comments