Home కెరీర్ వారసత్వ కొలువుల దరఖాస్తులు 1 నుంచి స్వీకరణ

వారసత్వ కొలువుల దరఖాస్తులు 1 నుంచి స్వీకరణ

singareniహైదరాబాద్ : సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల నియామక ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు సంస్థ చైర్మన్, ఎండి ఎన్. శ్రీధర్ మంగళవారం ప్రకటించారు. 2017 జనవరి నుంచి 1వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు అన్ని ఏరియాలకు ఉత్తర్వుల ప్రతులను విడుదల చేశారు. దాదాపు రెండు దశాబ్దాల తరువాత వారసత్వ ఉద్యోగాల పునరుద్ధరణపై సిఎం కె. చంద్రశేఖర్‌రావు చేసిన దిశానిర్దేశం మేరకు తక్షణమే స్పందించామన్నారు. నవంబర్ 4వ తేది బోర్డు ఆఫ్ డైరెక్టర్ల సమావేశాన్ని ఏర్పాటు చేసి, దీనికి బోర్డు అంగీకారాన్ని తీసుకొన్నామనీ, ఆ వెంటనే కమిటీ ఏర్పాటు చేసి 45 రోజుల్లోనే నియమాక నిబంధనల ఉత్తర్వులు రూపొందించి, జారీ చేశామన్నారు. కంపెనీ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం 48-59 సంవత్సరాల వయస్సు గత సింగరేణి కార్మికులు, వారి వారసులకు ఉద్యోగాలు ఇప్పించేందుకు దరఖాస్తు చేసుకొవచ్చనీ, ఆ తదుపరి కూడా కాలనుగుణంగా వస్తున్న ప్రతి కార్మికుని వారసులకు దీనివల్ల లబ్దిచేకూరుతుందని పేర్కొన్నారు. అదే విధంగా ఈ నియమాక ప్రక్రియ గురించి కార్మికులకు పూర్తి సమాచారం, సలహా, సూచనలు అందించడానికి సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాలలో సమాచార కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.