Search
Sunday 18 November 2018
  • :
  • :

నూతన పంచాయతీల పాలనపై నజర్

Appointment of Special Officers for Speaking

స్పీడందుకున్న స్పెషల్ ఆఫీసర్ల నియామకం ప్రక్రియ
మండలాల వారిగా సమీక్షించిన కలెక్టర్ ఎం. హరిత

మన తెలంగాణ/ వరంగల్ రూరల్ జిల్లా : గ్రామాలలో సుపరిపాలన అందించే ఉద్ధేశంతో ప్రభుత్వం నూతన గ్రామపంచాయతీకు శ్రీకారం చుట్టిన విషయం విదితమే. ఈ మేరకు నూతన పంచాయతీలతో పాటు ఆగస్టు 1 నుంచి స్పెషల్ ఆఫీసర్ల పాలన ప్రారంభం కానున్న నేపథ్యంలో వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ ఎం. హరిత బుధవారం కలెక్టర్ కాన్ఫిరెన్స్ హాల్‌లో జిల్లాలోని ఎంపిడిఓలు, తహసీల్థార్‌లతో సమావేశం నిర్వహించారు. మండలాల వారిగా సమీక్షించారు. జిల్లాలో గతంలో 269 గ్రామపంచాయతీలు ఉండగా నూతనంగా 132 గ్రామపంచాయతీలు ఏర్పాటైనట్లు తెలిపారు. కొత్తవి, పాతవి కలిపి మొత్తం 401 గ్రామపంచాయతీలలో స్పెషల్ ఆఫీసర్లను నియమించటానికి చర్యలు చేపట్టామని వివరించారు. జిల్లా స్థాయి ప్రభుత్వ అధికారులను అన్ని మండలాలలో మండలా కేంద్రాంలోని గ్రామపంచాయతీకి, మండలంలోని మేజర్ గ్రామపంచాయతీకి స్పెషల్ ఆఫీసర్‌గా నియమించనున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయి అధికారులకు ప్రతిమండలంలోని రెండు గ్రామపంచాయతీలు కేటాయించడం జరుగుందన్నారు. సమస్యాత్మకంగా ఉన్న వాటితో పాటు అధిక జనాభా కలిగిన గ్రామపంచాయతీలను ఎంపిడిఓలు, తహశీల్థార్లు బాధ్యత వహించాలన్నారు. నూతనంగా ఏర్పాటైన గ్రామపంచాయతీలకు క్యాడర్ వారిగా ఇఓపిఆర్‌డిలను సూపరింటెండెంట్లను, సిడిపిఒలను, ఎంఇఓలను, ఏఓలను సీనియన్ అసిస్టెంట్లను నియమించాలన్నారు. అటవిశాఖ, వైద్యారోగ్యశాఖ, ఎక్సైజ్, ఎలక్ట్రిసిటీ అధికారులను మినహించాలని డిపిఓకు సూచించారు.స్పెషల్ ఆఫీసర్లుగా బాధ్యతు నిర్వహించటానికి అభ్యంతరాలుంటే రాత పూర్వకంగా అభ్యంతరాలను స్వీకరించాలని డిపిఓకు సూచించారు. జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్ల నియామకం ప్రక్రియ పూర్తి చేసి బాధ్యతలు చేపట్టిన అనంతరం గ్రామ స్థాయిలో సమర్థవంతమైన పాలన అందించటానికి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు క్షేత్ర స్థాయిలో అమలు చేయటానికి జిల్లా యంత్రాంగం ద్వారా కృషి చేయడం  జరుగుతుందని కలెక్టర్ వివరించారు. ఈ సమావేశంలో డిపిఓ అనిల్ కుమార్, డిఆర్‌డిఓ డిపి శేఖర్‌రెడ్డి, ఆర్‌డిఓలు మహేందర్‌రెడ్డి, జి. రవి, ఎంపిడిఓలు, తహశీల్థార్‌లు, ఇఓపిఆర్‌డిలు పాల్గొన్నారు.

Comments

comments